సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఓజీ 2’.. దానయ్య తప్పుకోవడానికి కారణమేంటి?

ABN, Publish Date - Jun 23 , 2026 | 05:09 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఓజీ’. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోన్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ నిర్మాణ బాధ్యతల నుంచి డివివి దానయ్య తప్పుకోవడంతో.. కొత్తగా వేరే సంస్థలు వచ్చి చేరాయి.

Danayya Out From OG 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఓజీ’ (OG Movie). దర్శకుడు సుజీత్ స్టైలిష్ టేకింగ్, పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్ ఆయన చూపించిన విధానం.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సాధించిన భారీ విజయంతో దీనికి సీక్వెల్ ‘ఓజీ 2’కి కూడా ఎప్పుడో లైన్ క్లియర్ అయిపోయింది. అయితే, ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి భాగాన్ని ఎక్కడా రాజీ పడకుండా, భారీ బడ్జెట్‌తో నిర్మించి.. అటు థియేటర్స్, ఇటు ఓటీటీ ద్వారా భారీగా ప్రాఫిట్స్ పొందిన ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య (DVV Danayya), ఈ ‘OG 2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


వాస్తవానికి డి.వి.వి. దానయ్య ‘OG’ మొదటి పార్ట్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ, ఆయనకు ఇబ్బంది రాకుండా అన్ని విషయాలను జాగ్రత్తగానే చూసుకున్నారు. సినిమాపై ఆయన పెట్టుకున్న నమ్మకం నిజమై.. సినిమా విడుదల తర్వాత కాసుల వర్షం కూడా కురిసింది. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలోనే నేచురల్ స్టార్ నాని హీరోగా మరో సినిమాను నిర్మించేందుకు ఆయన రెడీ అయ్యారు. కొన్ని కారణాల వల్ల నాని-సుజీత్ ప్రాజెక్ట్ చేతులు మారడం, అలాగే ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని అంతర్గత పరిణామాల నేపథ్యంలో.. ‘OG 2’ సీక్వెల్ నిర్మాణం నుంచి కూడా దానయ్య ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. భారీ క్రేజ్ ఉన్న ఇలాంటి సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి దానయ్య వంటి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచినా.. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయనేది ఫిలిం నగర్ టాక్. ఆ కారణాలు ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.


ఇక ఈ సీక్వెల్ నుంచి దానయ్య తప్పుకోవడంతో.. ఆ బాధ్యతలను టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’, ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థతో కలిసి సంయుక్తంగా టేకోవర్ చేసిందనేలా ప్రచారం నడుస్తోంది. ఈ పక్కా స్టైలిష్ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని టాక్. తాజాగా దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్‌ను కలిసి ‘OG 2’ కి సంబంధించిన కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ పేజ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏదిఏమైనా దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం మాత్రం ఒకింత ఫ్యాన్స్‌కు నిరుత్సాహ పరిచే విషయమే. ఎందుకంటే, ‘ఓజీ’ సెట్స్‌పై ఉండగా.. ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయకుండా.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ.. ఈ సంస్థ వారిలో హుషారు నింపిన విషయం తెలియంది కాదు.

ఇవి కూడా చదవండి:

నారా లోకేష్‌తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే

నెట్‌ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్‌బేరర్ వస్తున్నాడు!

పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!

Updated Date - Jun 23 , 2026 | 05:09 PM