నారా లోకేష్‌తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:08 PM
ఏపీ మినిస్టర్ నారా లోకేష్‌తో తనని పోల్చుతూ యాంకర్ అడిగిన ప్రశ్నకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తనకంటూ స్టార్‌డమ్‌ని క్రియేట్ చేసుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan). ఇప్పుడాయన ఉన్న ఈ స్టేజ్ కోసం ఎంత కష్టపడ్డారో.. సినీ ఇండస్ట్రీలోని చాలా మందికి తెలుసు. చిరంజీవి కొడుకుగా ఆ లెగసీని మోయడం ఎంత కష్టమో తెలియంది కాదు. కానీ, చరణ్.. తన కష్టంతో ఆ లెగసీని ముందుకు తీసుకెళుతున్నారు. తండ్రి లెగసీనే కాకుండా, బాబాయ్ బాధ్యతని కూడా ఆయన సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ సమ్మిట్ 2026 వేదికపై రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందులో ముఖ్యంగా తనని.. ఏపీ మినిస్టర్ నారా లోకేష్ (Nara Lokesh)తో పోల్చుతూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. చరణ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ‘‘తండ్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. లోకేష్ నాయుడు దానిని అడ్వాంటేజ్ తీసుకోలేదు. తన స్వయంకృషితో.. ఒక ఉన్నతమైన లక్ష్యంతో ప్రజా నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తూ, విజయవంతంగా సాగుతున్నారు. అలాగే మీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. మీరు కూడా అలాగే కష్టపడుతూ.. స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. నారా లోకేష్‌కు, మీకు.. మధ్య ఈ విషయంలో పోలిక ఉందని భావిస్తున్నారా?’’ అని ఈ సమ్మిట్‌లో యాంకర్ అడిగిన ప్రశ్నకు.. రామ్ చరణ్ ఏ మాత్రం ఆలోచించకుండా, వెంటనే.. ‘అవును.. కచ్చితంగా ఉంది’ అని అంగీకరించారు.
చరణ్ ఆలోచించకపోవడానికి పెద్ద కారణం ఏమీ లేదు. ఎందుకంటే, అదే నిజం కాబట్టి. రాజకీయ చాణిక్యుడిగా పేరున్న చంద్రబాబు కుమారుడు లోకేష్.. ప్రస్తుతం సమర్థవంతమైన నాయకుడిగా, పరిపక్వతతో.. ప్రజల్లోకి బలంగా దూసుకెళుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంలోనూ, వాటిని తీర్చడంలోనూ మంచి చొరవ చూపిస్తున్నారు. అలాగే, తనపై ఆరోపణలు చేసేవారికి ఇచ్చిపడేస్తూ.. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నింటిని చూపెడుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా.. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, తన తండ్రి, బాబాయ్‌లా సామాజికి సేవ చేస్తూనే.. తను ఉన్న రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అంతర్జాతీయంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. తరచి చూస్తే.. లోకేష్, రామ్ చరణ్ సేమ్ లైన్ పైనే నడుస్తున్నట్లుగా అర్థమవుతోంది. అందుకే చరణ్.. ఆ పోలికను కరెక్ట్ అని ఒప్పుకున్నారు. రామ్ చరణ్ చెబుతున్న ఈ ఆన్సర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
నెట్‌ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్‌బేరర్ వస్తున్నాడు!
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!
సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!