సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాన్నను కోల్పోయినంత బాధగా ఉంది: వివి వినాయక్

ABN, Publish Date - Nov 07 , 2026 | 09:16 AM

టాలీవుడ్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ‘కాంతి పిక్చర్స్’ అధినేత ఎన్.వి. రెడ్డి మృతి తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి వార్త తెలిసి.. దర్శకుడు వినాయక్ భావోద్వేగానికి లోనయ్యారు.

VV Vinayak on NV Reddy

టాలీవుడ్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ‘కాంతి పిక్చర్స్’ అధినేత ఎన్.వి. రెడ్డి మృతి తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో పంపిణీదారుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను విడుదల చేసి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన కన్నుమూయడంపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ (Director VV Vinayak) ఆయనతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.


ఎన్.వి. రెడ్డి (NV Reddy) మృతి పట్ల వివి వినాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ‘‘కాంతి పిక్చర్స్ అధినేత ఎన్.వి. రెడ్డి గారు మనల్ని విడిచి వెళ్లిపోవడం నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయనతో నాకు ఎంతో కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్.వి. రెడ్డి గారిని, ఆయన సోదరుడు చిన్నరెడ్డి గారిని చూస్తూనే అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పగా ఉండాలో మేము నేర్చుకున్నాం. గతంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎంతటి తీవ్ర వేదన అనుభవించానో.. ఇప్పుడు ఎన్.వి. రెడ్డి గారు లేరనే వార్త వినగానే మళ్లీ నాన్నను కోల్పోయినంత బాధ కలిగింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


ఎన్.వి. రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు భగవంతుడు కొండంత మనోధైర్యాన్ని ప్రసాదించాలని వినాయక్ ప్రార్థించారు. టాలీవుడ్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల విడుదలలో కీలక పాత్ర పోషించి, నిర్మాతలు, దర్శకులు, బయ్యర్లతో ఆత్మీయ సంబంధాలు కొనసాగించిన ఎన్.వి. రెడ్డి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘టైసన్ నాయుడు’ ఫోక్ బ్యాంగర్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అదిరింది

Sunday Tv Movies: దీవాళి బొనాంజా.. ఆదివారం టీవీ సినిమాల లిస్ట్

Teja Sajja: ఎంగేజ్‌మెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Updated Date - Nov 07 , 2026 | 09:24 AM