సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘లెనిన్’ కోసం గర్జించిన యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ABN, Publish Date - Jul 06 , 2026 | 06:29 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ విడుదలకు సిద్ధమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం జూలై 10న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్ అందించారు.

NTR And Akhil

అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ (Lenin) విడుదలకు సిద్ధమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం జూలై 10న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. రోజుకో క్రేజీ అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్ నింపుతున్న మేకర్స్, తాజాగా ఒక సెన్సేషనల్ న్యూస్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) తన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు స్కై హైకి చేరాయి.


ఈ విషయాన్ని అఖిల్ అక్కినేని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘థాంక్యూ టైగర్.. థాంక్స్ ఫర్.. రోరింగ్ ఫర్ లెనిన్. ఎప్పటికీ మరిచిపోలేనంత ప్రేమ ఇచ్చావు. లవ్ యూ బ్రదర్’ అంటూ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మేకర్స్ రిలీజ్ చేసిన పులి, ‘లెనిన్’ టైటిల్ లోగో ఉన్న పోస్టర్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అఖిల్ కెరీర్‌కు ఎంతో కీలకమైన ఈ సినిమాకు ఎన్టీఆర్ లాంటి మాస్ ఐకాన్ సపోర్ట్ దొరకడం మేజర్ ప్లస్ పాయింట్. ఆయన వాయిస్ నరేషన్ సినిమాను కేవలం అక్కినేని అభిమానులకే కాకుండా, సాధారణ ప్రేక్షకులకు సైతం మరింత బలంగా చేరువ చేస్తుందనడంలో సందేహం లేదు.


అయితే, ఈ వాయిస్ ఓవర్ అనౌన్స్‌మెంట్‌తో పాటు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. ఎన్టీఆర్ తన చిత్రాలైన ‘దేవర’, ‘వార్ 2’, ఇంకా రీసెంట్‌గా విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్‌లో ఒకే రకమైన ‘హెవీ-బేస్’ వాయిస్ మోడ్యులేషన్‌ను వాడుతున్నారనే అభిప్రాయం కొందరు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఆ గంభీరమైన వాయిస్ అభిమానులను అలరిస్తున్నప్పటికీ, అది కాస్త రొటీన్‌గా మారి ఇంపాక్ట్ తగ్గుతుందేమో అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎలాంటి నరేషన్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కనుక ఈ కథ కోసం సరికొత్త ఎమోషనల్ టెక్స్చర్‌తో, విభిన్నమైన మోడ్యులేషన్ ట్రై చేస్తే అది సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా మారుతుంది. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లెనిన్’ ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించగా, ఇప్పుడు తోడైన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమా ప్రమోషన్స్‌కు విపరీతమైన మైలేజ్‌ను ఇస్తోంది. జూలై 10న థియేటర్లలో అఖిల్ యాక్షన్, ఎన్టీఆర్ వాయిస్ మ్యాజిక్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి!

ఇవి కూడా చదవండి:

Madhavan: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడమే నా గోల్

‘రన్’ విజయ్‌ చేయాల్సిన సినిమా .. కానీ: లింగుసామి

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు: ప్రకాష్ రాజ్‌పై బండ్ల ఫైర్

Updated Date - Jul 06 , 2026 | 06:29 PM