సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రావిపూడి మాస్ ప్లాన్.. ఎన్టీఆర్ - రవితేజ మల్టీస్టారర్

ABN, Publish Date - Nov 29 , 2026 | 04:03 PM

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ వార్తపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Ntr- Raviteja

పటాస్ నుంచి మన శంకరవరప్రసాద్ గారు వరకు వరుస బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ప్రస్తుతం జనవరి 12 విడుదల సినిమాతో బిజీగా ఉన్న ఆయన ఈ మధ్యనే.. ఎన్టీఆర్ (NTR) తో ఒక సినిమాని ప్రకటించి షాక్ ఇచ్చాడు. గ్లోబల్ స్థాయిలో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ వంటి భారీ యాక్షన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా ప్రకటించడంతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.


ఇప్పటివరకు సీరియస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రల్లో కనిపించిన తారక్‌ను, ఈసారి పూర్తి స్థాయి వినోదాత్మక కోణంలో ఆవిష్కరించేందుకు అనిల్ రావిపూడి ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌లోని సహజ నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, మాస్ ఎలివేషన్లను బ్యాలెన్స్ చేస్తూ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారట. ముఖ్యంగా హీరో పాత్ర నుంచే నాన్‌స్టాప్ హాస్యం పండేలా, దానికి బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, ఊహించని ట్విస్టులు తోడయ్యేలా కథను తీర్చిదిద్దుతున్నారని టాక్.


ఇదిలా ఉంటే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కోసం అనిల్ రావిపూడి ఒక ప్రత్యేక పాత్రను రాస్తున్నారట. ఇది కేవలం అతిథి పాత్రలా కాకుండా, కథను మలుపుతిప్పే కీలక పాత్రగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. గతంలో అనిల్ రావిపూడి- రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన రాజా ది గ్రేట్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఇప్పుడు ఎన్టీఆర్ - రవితేజ స్క్రీన్ షేర్ చేసుకుంటే థియేటర్లలో పూనకాలు ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు.


అసలు ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా అంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.. అలాంటిది మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడని తెలియడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీలో మరో భారీ మల్టీస్టారర్ గా ఈ చిత్రం రికార్డు సృష్టించినట్టే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర బృందం ఎప్పుడు అధికారిక క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.

Updated Date - Nov 29 , 2026 | 04:12 PM