ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ షూటింగ్‌ రద్దు.. టీమ్ స్పందనిదే!

ABN , Publish Date - Apr 08 , 2026 | 10:15 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’. ‘వార్-2’ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Jr NTR and Prashanth Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (Dragon). ‘వార్-2’ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే విధంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు ఈ సినిమాపై వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, తారక్ లుక్ విషయంలో దర్శకుడు సంతృప్తిగా లేకపోవడం వల్ల ఇప్పటికే తీసిన సన్నివేశాలను తొలగించారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలు నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో నందమూరి అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది.


సోషల్ మీడియా అంతా ఇదే విషయంపై చర్చ నడుస్తుండటంతో.. సదరు వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పందిస్తూ అధికారికంగా క్లారిటీ ఇచ్చాయి. ప్రచారంలో ఉన్న పుకార్లలో ఏమాత్రం వాస్తవం లేదని వారు కొట్టిపారేశారు. ఈ సినిమా షూటింగ్ నిలిచిపోలేదని, కేవలం తదుపరి షెడ్యూల్ కోసం జరుగుతున్న సాధారణ విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయనే వార్తలు కేవలం కల్పితమని తేల్చి చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ‘డ్రాగన్’ శరవేగంగా ముస్తాబవుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, బిమల్ ఒబేరాయ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్‌కు తగ్గట్టుగా రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.


షూటింగ్ విషయంలో నిర్మాతలు క్లారిటీ ఇచ్చినప్పటికీ, సినిమా విడుదల తేదీపై మాత్రం సినీ సర్కిల్స్‌లో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తొలుత ఈ చిత్రాన్ని (NTRNeel) 25 జూన్ 2026న విడుదల చేయాలని భావించారు. అయితే ఇంకా చాలా భాగం చిత్రీకరణ బాకీ ఉండటం, గ్రాఫిక్స్ పనులకు కూడా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. అనుకున్న సమయానికి సినిమా రావడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రమోషన్ల విషయంలో కూడా చిత్ర బృందం ఎంతో గోప్యతను పాటిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రోమోలు లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయలేదు. సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

స్క్రీన్స్ తక్కువ.. క్రేజ్ ఎక్కువ! డ్యూన్ మేనియా షురూ.. ఒక్కో టికెట్ 90 వేలు

అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా.. ‘లెనిన్’ న్యూ పోస్టర్ విడుదల

ఆమనికి తెలంగాణ బీజేపీలో పదవి...

Updated Date - Apr 09 , 2026 | 12:22 AM

Dragon: అదేంటి అది.. మొన్నే అవుట్ ఫుట్ బాలేదన్నారు.. ఇప్పుడు రెండు పార్ట్స్ అంటారేంటి

Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు.. బిగ్ షాక్‌: NTR - ప్రశాంత్ నీల్.. సినిమా 'డ్రాగన్' కాదట! రిలీజ్ మ‌రింత‌ ఆల‌స్యం?

Dragon: యన్టీఆర్ - నీల్ మధ్య విభేదాలు ముగిసినట్టేనా..

NTRNEEL: ఎన్టీఆర్ కోసం యానిమల్ ఫాదర్ ని దింపిన నీల్..

NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..