ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’.. అంతా ఈ సీన్ గురించే మాట్లాడుకుంటారట!

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:19 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ సెన్సేషన్ ‘డ్రాగన్’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో రోజుకో వార్త వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే.

NTR Dragon Update

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR) నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘డ్రాగన్’ (Dragon). ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో రోజుకో అప్‌డేట్‌ వైరల్‌గా మారుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ముస్తాబవుతోంది. ఇక రీసెంట్‌గా మేకర్స్ వదిలిన గ్లింప్స్ అయితే ఇంటర్నెట్‌ను షేక్ చేసి పారేసింది. ఆ ఒక్క చిన్న వీడియోతోనే బాక్సాఫీస్ దగ్గర రాబోయే కాలంలో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నారో మేకర్స్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. ఆ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్‌ నీల్‌ స్టైల్‌ డార్క్ థీమ్ చూసి ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో తారక్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ పక్కన ఆమె పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. రోజురోజుకూ శరవేగంగా షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ.. ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ స్వింగ్‌లో ముందుకు సాగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. డ్రాగన్ నెక్స్ట్ షెడ్యూల్‌కి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మేకర్స్ నెక్స్ట్ ఒక భారీ షెడ్యూల్‌కి రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో తారక్‌పై ఒక గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఈ ఫైట్ సీన్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని ఇన్‌సైడ్ టాక్. అంతే కాదు, ఈ అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ కోసం టీమ్ ఏకంగా శ్రీలంకకు మకాం మార్చబోతున్నారని సమాచారం. శ్రీలంకలోని అందమైన, అలాగే రగ్గడ్ లొకేషన్స్‌లో ఈ సీన్స్‌ను ప్లాన్ చేశారు. ఈ ఫైట్‌తో పాటు ఒక భారీ బడ్జెట్ సాంగ్‌ను కూడా ఇదే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదల తర్వాత ఈ యాక్షన్ సీన్ గురించే అంతా మాట్లాడుకుంటారనేలా టాక్ నడుస్తోంది.


ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘కెజియఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఎలాంటి ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి ఈ పాన్ వరల్డ్ సినిమా రికార్డులను ఎలా బద్దలు కొడుతుందో తెలియాలంటే ఇంకో వన్ ఇయర్ వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్‌ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్

తల్లి కాబోతున్న సమంత..

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

Updated Date - Jun 17 , 2026 | 03:26 PM

Dragon Glimpse: పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు.. అదిరిపోయిన గ్లింప్స్ 

Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు.. బిగ్ షాక్‌: NTR - ప్రశాంత్ నీల్.. సినిమా 'డ్రాగన్' కాదట! రిలీజ్ మ‌రింత‌ ఆల‌స్యం?

Dragon: ట్రైనర్‌ లుక్.. ఈ పాత్రని గుర్తుపెట్టుకోండి!

Dragon: ఎన్టీఆర్ మూవీలో విద్యాబాలన్...

Dragon: అదేంటి అది.. మొన్నే అవుట్ ఫుట్ బాలేదన్నారు.. ఇప్పుడు రెండు పార్ట్స్ అంటారేంటి