‘కొరియన్ కనకరాజు’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:40 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ రితికా నాయక్ జంటగా నటించిన సరికొత్త హారర్-కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ మూవీ టీమ్‌తో NSR ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.

NSR Interview With Korean Kanakaraju Team

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ రితికా నాయక్ (Ritika Nayak) జంటగా నటించిన సరికొత్త హారర్-కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్, రితికా నాయక్‌లతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ.


ఈ ఇంటర్వ్యూలో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటంటే.. గతంలో తాను కొన్ని సీరియస్ రోల్స్ చేశానని, ఈసారి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి తమ కష్టాలన్నీ మరిచిపోయి కడుపుబ్బ నవ్వుకునేలా ఈ సినిమాని మలిచామని వరుణ్ తేజ్ తెలిపారు. రాయలసీమ (పెనుగొండ, అనంతపూర్) బ్యాక్‌డ్రాప్.. కొరియన్ కల్చర్, అండర్ వరల్డ్ కలయికతో సినిమా సాగుతుందని వివరించారు. ఈ సినిమాలో కొరియన్ భాషను పలకడానికి తాను స్కూల్ రోజుల్లో పరీక్షలకు చదివినట్లు బట్టీ పట్టి నేర్చుకున్నానని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ విషయంలో ఎస్. థమన్ అద్భుతమైన ఫ్యూజన్ అందించాడని ప్రశంసించారు.


షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఇంజరీ గురించి మాట్లాడుతూ.. యాక్టర్లకు ఫిజికల్ స్ట్రెస్, గాయాలు సహజమేనని.. ఈ గాయం వల్ల సినిమా ఆగస్ట్ 7కి వాయిదా పడటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్‌పై మరింత జాగ్రత్త వహించే సమయం దొరికిందని అన్నారు. బెడ్ రెస్ట్ సమయంలో తన కుమారుడు వాయువ్ తోనూ, భార్య లావణ్య త్రిపాఠితోనూ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో బడ్జెట్ మేనేజ్మెంట్ చాలా కీలకమని, కొరియాలో రూ. 10-15 కోట్లు అయ్యే షూటింగ్‌ను కజకిస్తాన్‌లో ప్లాన్ చేసి దాదాపు 30 శాతం ఖర్చు తగ్గించామని వరుణ్ తేజ్ వెల్లడించారు. కేవలం 74-75 రోజుల్లోనే ఎలాంటి వేస్ట్ లేకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చిత్రీకరణ పూర్తి చేశామని తెలిపారు. హీరోయిన్ రితికా నాయక్ మాట్లాడుతూ.. తనకు నిజజీవితంలో కే-పాప్, కే-డ్రామాలు అంటే చాలా ఇష్టమని, ఈ పాత్ర చేయడం ఎంతో హ్యాపీగా ఉందని పేర్కొంది. ఇంకా వరుణ్ తేజ్, రితినా నాయక్ చెప్పిన విశేషాలేంటో తెలియాలంటే పై ఇంటర్వ్యూ వీడియో పూర్తిగా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది

‘సంత’ చిత్రకళా పోటీకి ట్రెమండస్ రెస్పాన్స్.. దర్శకుడు హ్యాపీ!

MS Raju: ‘ఒక్కడు’కు మహేష్, ‘వర్షం’కు ప్రభాస్.. మరి ‘అగధ’కు?

Updated Date - Aug 03 , 2026 | 06:40 PM