సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లేడీ పవర్‌తో నవంబర్ హీటెక్కనుందా

ABN, Publish Date - Nov 04 , 2026 | 06:38 PM

నవంబర్ లో నయనానందం కలిగించేలా నాలుగు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వస్తున్నాయి. నాలుగు సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో మూడు సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ నటించడంతో మరింత ఇంట్రెస్ట్ కలుగుతోంది.

November Movie Releases

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'మహాశక్తి-2' దీపావళి కానుకగా నవంబర్ 6న రిలీజవుతోంది. తమిళ నటదర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఆరేళ్ళ క్రితం వచ్చిన 'మూకుత్తి అమ్మన్' తెలుగులోనూ అలరించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు 'మూకుత్తి అమ్మన్-2' వస్తోంది. తెలుగులో ఈ సినిమా 'మహాశక్తి-2'గా విడుదల కానుంది. నయనతార అమ్మవారి పాత్రలో కనిపించిన ఈ సినిమా మొదటి భాగం విశేషాదరణ చూరగొంది. దాంతో రెండో భాగంపైనా ప్రేక్షకులు ఆసక్తిని పెంచుకున్నారు. ట్రైలర్ చూస్తోంటేనే ఓ పీరియడ్ డ్రామాలా భారీ స్థాయిలో 'మహాశక్తి'ని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. దీపావళి కానుకగా సూర్య 'సీన్' సినిమా కూడా నవంబర్ 6 తేదీనే వస్తోంది.అయినా నయన్ స్టార్ డమ్ మీద, తమ సబ్జెక్ట్ మీద నమ్మకంతో 'మహాశక్తి-2'ను రిలీజ్ చేస్తున్నారు.


ఇదే నెలలో ఒకే రోజున రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ జనం ముందుకు వస్తున్నాయి. రెండు చిత్రాల్లోనూ అమ్మాయిలు తమ లక్ష్యం కోసం తపించే కథలే కనిపిస్తాయి. చిన్నతనం నుంచీ ఆకాశం వైపు చూస్తూ అమ్మమ్మ చెప్పే కథలు వింటూ చివరకు 'ఆస్ట్రోనాట్' కావాలని ఓ చిన్నారి కలలు కంటుంది. తన స్వప్నాన్ని ఆమె ఎలా సాకారం చేసుకుంది అన్నదే 'డియర్ ఆస్ట్రోనాట్' కథ. కార్తిక్ భాగ్యరాజా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 20న విడుదలవుతోంది. అదే రోజున కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'సత్యవాన్ సావిత్రి' వస్తోంది. ఈ సినిమా ద్వారా ప్రవీన్ ఎస్.విజయ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఓ సీనియర్ లాయర్ ను స్ఫూర్తిగా తీసుకొని సావిత్రి అనే అమ్మాయి లాయర్ అవుతుంది. మొదట్లో వృత్తిపట్ల అంతగా అంకితభావం ప్రదర్శించని సావిత్రి, తరువాత ఓ క్లిష్టమైన కేసును ఎలా వాదించి తన భర్తను కాపాడుకుంది అన్నదే కథ.

నవంబర్ 20న వచ్చే రెండు చిత్రాలు అమ్మాయిల్లో స్ఫూర్తి కలిగించేలా రూపొందాయి. 'మహాశక్తి'లాగే సోషియో ఫాంటసీగా 'మైసా' కొన్ని మూఢ విశ్వాసాలతో రూపొందింది. రశ్మిక మందణ్ణ ప్రధాన పాత్ర పోషించిన 'మైసా' చిత్రం నవంబర్ 27న వెలుగు చూడనుంది. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు. ఓ గిరిజన మహిళ జీవితంలో తనకు ఎదురైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది. కొన్ని దుష్టశక్తుల కారణంగా అతలాకుతలమైన తన జాతిని మైసా ఎలా రక్షించుకుంది అన్నది ఇందులోని ప్రధానాంశం. ఇప్పటికే 'మైసా'లోని టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'డియర్ ఆస్ట్రోనాట్'ను మినహాయిస్తే ఈ నెల ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ స్టార్ హీరోయిన్స్ నటించారు. దాంతో ఈ చిత్రాల కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వీటిలో ఏ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

వి.వి. వినాయక్ సమక్షంలో కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

రేంజ్ మ్యాటర్.. చిరు ‘కాకా’కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్

‘టైసన్ నాయుడు’ నుంచి మాస్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే

Updated Date - Nov 04 , 2026 | 06:38 PM