Naga Vamsi: స్టోరీ ఉండదు.. ఎవరినీ తిట్టము! జస్ట్ ఫన్ కోసం.. సినిమాకు రండి
ABN, Publish Date - Feb 08 , 2026 | 07:46 AM
విశ్వక్‌సేన్ హాస్య చిత్రాల దర్శకుడు కేవీ అనుదీప్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘ఫంకీ.
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే విశ్వక్‌సేన్ (Vishwak Sen), హాస్య చిత్రాల దర్శకుడు కేవీ అనుదీప్ (KV Anudeep) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘ఫంకీ’(Funky). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) , సాయి సౌజన్య నిర్మించారు. ఈనెల 13న విడుదలవుతోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. విశ్వక్ సేన్ మేనరిజమ్స్, కథానాయిక కయాదు లోహర్‌తో కెమిస్ట్రీ ట్రైలర్‌లో ప్రధానాకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘దాదాపు ఏడాది విరామం తర్వాత ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ‘ఫంకీ’ సినిమా ఆద్యంతం మిమ్మల్ని నవ్విస్తుంది’ అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ ‘దర్శకుడు అనుదీప్ తన ‘జాతిరత్నాలు’ చిత్రంతో ఏ స్థాయి వినోదాన్ని పంచారో, అంతకు మించి ఫంకీలో ఉంటుంది. కామెడీ టైమింగ్ సినిమాకు ప్రాణం. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచం’ అని చెప్పారు. అదేవిధంగా సినిమాలో స్టోరీ ఉండదని.. జస్ట్ ఫన్ కోసం మాత్రమే రావాలని, ఈ సారి ఎవరినీ తిట్టము.. కడుపుబ్బా నవ్విస్తామని తెలిపారు. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది అని అనుదీప్ తెలిపారు.