సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నీతి టేలర్ అంత మాట అనేసిందేమిటీ!?

ABN, Publish Date - Oct 13 , 2026 | 11:10 AM

నటి నీతి టేలర్ దర్శకుడు త్రినాథరావు నక్కినపై ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది. తొలి తెలుగు సినిమా సమయంలో ఎదురైన చేదు అనుభవం కారణంగానే టాలీవుడ్‌కు దూరమైనట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Niti Taylor

'మేం వయసు వచ్చాం' సినిమాలో నటించిన ఉత్తరాది భామ నీతి టేలర్ గుర్తుందా? ఆ తర్వాత సంవత్సరం 'పెళ్ళిపుస్తకం'లోనూ నటించింది. ఇక ఆమె నటించిన చివరి తెలుగు సినిమా 'లవ్ డాట్‌ కామ్'. ఇంతకూ విషయం ఏమంటే... తన తొలి చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన మీద నీతి టేలర్ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. తొలి చిత్రం సమయంలో తనతో బాగానే ఉన్న ఈ దర్శకుడు మరో సినిమాకు ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్‌ మెంట్‌ కు అంగీకరించాలన్నడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నీతి టేలర్ తెలిపింది.

31 సంవత్సరాల నీతి టేలర్‌ 2012లో 'మేం వయసుకు వచ్చాం' సినిమాలో నటించింది. బెక్కెం వేణు నిర్మించిన ఈ సినిమాను త్రినాథ రావు నక్కిన తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకు అదే మొదటి సినిమా. తనీశ్‌ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో నీతి టేలర్ కు తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. వెంటనే రాహుల్ రవీంద్రన్ సరసన 'పెళ్ళిపుస్తకం'లో నటించింది. అయితే తొలి చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఎదురైన చేదు అనుభవంతో తాను తెలుగు సినిమా రంగానికి దూరమైపోయాయని, అప్పటి నుంచి మరే తెలుగు సినిమా చేయలేదని తెలిపింది. నటనకు ఎందుకు దూరమయ్యారనే ప్రశ్నకు సమాధానంగా ఆ ఇంటర్వ్యూలో ఆమె ఈ కాస్టింగ్ కౌచ్ వివరాలు తెలిపింది.


బాలనటిగా బుల్లితెరపై మెరిసిన నీతి టేలర్ మ్యూజిక్‌ ఆల్బమ్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు ఆమెకు వచ్చాయి. అయితే సినిమాలకంటే టీవీ రంగానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. నటిగా లైమ్ లైట్‌లో ఉండగానే 2020లో బోయ్ ఫ్రెండ్‌ పరీక్షిత్‌తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి అడపాదడపా మ్యూజిక్‌ వీడియోస్ మాత్రం చేస్తోంది. మరి నీతి టేలర్‌ చేసిన ఈ ఆరోపణలపై త్రినాథ రావు నక్కిన ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఊటీలో ‘జనవరి 12 విడుదల’ టీమ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే

‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు

Updated Date - Oct 13 , 2026 | 11:23 AM