Nithiin: నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:17 PM
నితిన్ (nithiin) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini). నేచురల్ స్టార్ నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు.
నితిన్ (nithiin) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini). నేచురల్ స్టార్ నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంట నిర్మాత. టైటిల్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇందులో నితిన్ కళ్లద్దాలు, భుజానికి బ్యాగ్‌తో సాధారణ యువకుడి లుక్‌లో కనిపిస్తున్నారు. కోర్టు పరిసరాల్లో రూపొందించిన ఈ పోస్టర్ కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో నితిన్ కృష్ణ అనే సాధారణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. అతడు ప్రేమలో పడిన తర్వాత జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఓ రహస్యం అతడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్నది కథలో కీలకంగా ఉండనుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేయనున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కిలికిని మించి.. ‘వారణాసి’ కోసం జక్కన్న ‘బాహుబలి’ స్ట్రాటజీ!
రాజ్యసభ వైపు రజనీకాంత్ వైఫ్ లత అడుగులు..!
హానెస్టీ ‘అహంకారం’గా.. ఆత్మవిశ్వాసం ‘బలుపు’గా అనిపిస్తే.. నేను తగ్గాలా?: విజయ్ దేవరకొండ