నితిన్ ‘హ్యాట్రిక్’ సినిమాలు.. ఈసారైనా హిట్ దక్కేనా
ABN, Publish Date - Jul 16 , 2026 | 05:43 PM
2020లో విడుదలైన ‘భీష్మ’ సినిమా తర్వాత నితిన్‌కు మళ్లీ ఆ స్థాయి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఆ తర్వాత ఆయన నటించిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో, ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో నితిన్ ఉన్నట్లు తెలుస్తోంది.
‘జయం’ (Jayam) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న హీరో నితిన్ (Nithiin). 2002లో తేజ (Director Teja) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన ఆయన, ఉత్తమ నూతన నటుడిగా ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’, అలాగే వి.వి. వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్’ వంటి చిత్రాలతో మాస్, యూత్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. కెరీర్‌లో వరుసగా కొన్ని ఒడిదొడుకులు, పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం అధైర్యపడకుండా ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి, పడి లేచిన కెరటంలా టాలీవుడ్‌లో దూసుకుపోయారు. (Nithiin Next Films)
అయితే, 2020లో విడుదలైన ‘భీష్మ’ సినిమా తర్వాత నితిన్‌కు మళ్లీ ఆ స్థాయి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఆ తర్వాత ఆయన నటించిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో, ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో నితిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నితిన్ మరోసారి సక్సెస్ బాట పట్టాలని టార్గెట్‌గా పెట్టుకుని, ఒకేసారి మూడు విభిన్న ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా చర్చ సాగుతోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల వరకు, అలాగే సరికొత్త కాంబినేషన్లలో వైవిధ్యమైన కథలను ఆయన ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ లైనప్‌లో భాగంగా, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో సోమశేఖర్ సరిపల్లి, నాని కాసిరెడ్డి అనే యువ దర్శకులు తెరకెక్కించబోయే చిత్రంలో నితిన్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
మరోవైపు, నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో నితిన్ ఒక విభిన్నమైన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని, సరికొత్త జోనర్‌లో సాగే ఈ కథ నితిన్ కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలవనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇదే సమయంలో రీసెంట్‌గా ‘ఆయ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ డైరెక్టర్ అంజి బాబుతో కూడా నితిన్ ఒక కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతున్న ఈ మూడు సినిమాలపై ఆయా చిత్రబృందాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. అయినప్పటికీ, నితిన్ ఈ మూడు విభిన్న లైనప్‌లతో బలమైన కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ ట్రిపుల్ లైనప్ నితిన్‌ను మరోసారి టాలీవుడ్ టాప్ రేస్‌లో నిలబెడుతుందో లేదో చూడాలి!.
ఇవి కూడా చదవండి:
‘వారణాసి’.. జక్కన్నకు కొత్త టెన్షన్!
బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..
KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో