సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నివేదా థామస్ తమ్ముడు హీరోగా.. సినిమా టైటిల్ ఇదే!

ABN, Publish Date - May 25 , 2026 | 05:38 PM

నివేదా థామస్‌ తమ్ముడు నిఖిల్ థామస్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'బెంగళూరు మహానగరంలో బాలక'. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ వరంగల్‌, హన్మకొండలో పూర్తయ్యింది.

Niveda Thomas

సినిమా రంగంలో అక్క బాటలో నడిచే చెల్లెళ్ళు చాలామందే ఉన్నారు. అయితే చిత్రంగా అక్క హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో తమ్ముళ్ళు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. ఇటీవలి కాలంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ తెలుగులో కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. అయితే నటుడిగా కంటే కూడా డ్రగ్స్ వ్యవహారంలో అతని పేరు ఎక్కువగా మీడియాలో కనిపించింది.

ఇదిలా ఉంటే... ప్రముఖ కథానాయిక నివేదా థామస్‌ (Nivetha Thomas) తమ్ముడు నిఖిల్‌ సైతం ఇప్పుడు హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను హీరోగా నటిస్తున్న 'బెంగళూరు మహానగరంలో బాలక' (బీఎంబీ) సినిమా తొలి షెడ్యూల్‌ను ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మహీ, రాజశేఖర్ దర్శకత్వంలో సీహెచ్‌.వి. శర్మ, ఎమ్మెస్ఎన్‌ మూర్తి నిర్మిస్తున్నారు. ఇటీవల నటుడు ప్రియదర్శి పులికొండ చేతుల మీదగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించిందని వారు తెలిపారు.


బెంగళూరు నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఆ మహానగరంలో జీవితం సాగించే ఓ తెలుగు కుర్రాడి కష్టాలు, అనుభవాలు, భావోద్వేగాలను వినోదాత్మకంగా చూపించబోతున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు. తొలి షెడ్యూల్‌ను వరంగల్‌, హన్మకొండ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. త్వరలోనే రెండో షెడ్యూల్‌ మొదలవుతుందని, దానితో సినిమా పూర్తవుతుందని అన్నారు. నిఖిల్‌ థామస్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రఘు కారుమంచి, చిత్రం శ్రీను, ధనరాజ్‌ వినీత్‌, మహేంద్ర, అచ్యుత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మల్లు నాయక్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విశ్వదీప్‌ స్వరరచన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలేస్తోంది: బాలకృష్ణ

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

జ‌స్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చ‌ర‌ణ్.. అసలు విషయమిదే!

Updated Date - May 25 , 2026 | 05:47 PM