Niharika Konidela: అన్న ‘బరి’లో దిగకముందే.. చెల్లెలు గ్యాంబ్లింగ్ షురూ!
ABN, Publish Date - Jun 12 , 2026 | 09:21 PM
నిహారిక కొణిదెల నిర్మాతగా తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె రీసెంట్‌గా ‘బరి’ అనే చిత్రాన్ని ప్రకటించగా, ఇప్పుడా సినిమా కంటే ముందే మరో సినిమాను ఆమె లైన్‌లో పెట్టారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మాతగా తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆమె బ్యానర్ నుంచి వచ్చిన ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘రాకాస’ చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది. వాస్తవానికి వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా ‘బరి’ (Bhari) అనే భారీ చిత్రాన్ని నిహారిక అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రిపరేషన్స్ సమయంలో వరుణ్ తేజ్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ గ్యాప్‌లోనే నిహారిక తన బ్యానర్‌లో మరో విభిన్నమైన సబ్జెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చి, ‘బరి’ కంటే ముందే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసినట్లుగా ఎక్స్‌క్లూజివ్ సమాచారం.
ఈ ప్రాజెక్ట్ పూర్తిగా గ్యాంబ్లింగ్ (Gambling) నేపథ్యంలో సాగే ఒక మైండ్ గేమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. దీనికోసం మెజారిటీ షూటింగ్‌ను శ్రీలంకలోని ఫేమస్ కాసినోస్, లగ్జరీ లొకేషన్లలో ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వచ్చి చాలా కాలం కావడంతో ఈ కథపై నిహారిక చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) టీమ్ నుంచి వచ్చిన ‘రుద్ర’ అనే టెక్నీషియన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జక్కన్న టీమ్‌లో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండటంతో, ఈ లార్జర్ ద్యాన్ లైఫ్ సబ్జెక్ట్‌ను ఆయన స్క్రీన్‌పై చాలా గ్రాండ్‌గా చూపించబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తుండటం విశేషం. అందులో ఒక హీరోగా ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాలో సుబ్బు పాత్రలో తన యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ త్రినాథ్ వర్మను కన్ఫర్మ్ అయ్యారు. నిహారిక హోమ్ బ్యానర్‌లోనే మరోసారి త్రినాథ్‌కు హీరోగా క్రేజీ ఛాన్స్ దక్కడం విశేషం. కాగా, ఈ సినిమాలో ఉండే మరో కీలకమైన హీరో పాత్ర కోసం టాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ యంగ్ హీరోతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది.
ఇవి కూడా చదవండి:
ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!
ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ