సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త హంగులతో ముస్తాబైన ‘లీలా మహల్’!
ABN , Publish Date - May 14 , 2026 | 10:59 AM
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త హంగులతో ‘లీలా మహల్’ థియేటర్ ముస్తాబైంది. దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ థియేటర్, ఇప్పుడు ఆధునిక హంగులతో సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త హంగులతో ‘లీలా మహల్’ (Leela Mahal) థియేటర్ ముస్తాబైంది. దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన నెల్లూరు (Nellore) ‘లీలా మహల్’ థియేటర్, ఇప్పుడు ఆధునిక హంగులతో సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సినిమా చూడటమే ఒక గొప్ప అనుభూతిగా మార్చేలా, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్, అద్భుతమైన వాతావరణంతో ఈ థియేటర్ నేడు (మే 14) ప్రారంభోత్సవం జరుపుకుంది. UV క్రియేషన్స్ భాగస్వామ్యంతో పునర్నిర్మితమైన ఈ సినిమా హాల్, నెల్లూరు నగరంలోనే అత్యుత్తమ సినిమా కేంద్రంగా నిలవనుంది.
ప్రస్తుతం ‘లీలా మహల్’ స్పెషల్ ఏమిటంటే.. ప్రేక్షకులకు వెండితెరపై మాయాజాలాన్ని చూపించేందుకు Barco 4K Laser ప్రొజెక్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తోడు Dolby Atmos సౌండ్ సిస్టమ్ తోడవ్వడంతో, ప్రతి సీన్ రియలిస్టిక్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళ్లనుంది. విశాలమైన స్క్రీన్స్, పవర్‌ఫుల్ అకౌస్టిక్స్, రాజసం ఉట్టిపడే సీటింగ్ అరేంజ్‌మెంట్.. ఇప్పుడీ థియేటర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చాలా కాలం తర్వాత నెల్లూరులో సినిమా ఇంత రిచ్‌గా, లార్జర్ దన్ లైఫ్ అనుభూతిని అందించబోతోందని యూవీ సంస్థ ప్రకటించింది. మరి ఈ విజువల్ వండర్‌ను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీ టికెట్లను బుక్ చేసుకోండి. లీలా మహల్ టికెట్లు ప్రత్యేకంగా District India యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, లగ్జరీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం సిద్ధమవ్వండి!
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం