National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!
ABN, Publish Date - Jul 03 , 2026 | 01:08 PM
కాసేపట్లో 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఈ ఎడిషన్‌లో కూడా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నిలుస్తాడా? తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే.
కాసేపట్లో 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను (72nd National Film Awards 2026) కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతోంది. 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) చరిత్రను లిఖించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ లిస్ట్‌లో ఆయన పేరు వినిపిస్తోంది. ‘పుష్ప పార్ట్ 1’ చిత్రానికి ఆయన నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి కూడా ఆయనకు నేషనల్ అవార్డు వస్తుందని ఆయన అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. నిజంగా అదే జరిగితే.. టాలీవుడ్ నుంచి రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్రను లిఖించినట్టే. మరి ఇది జరుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొంత సేపు వెయిట్ చేయాల్సిందే.
69th నేషనల్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి అవార్డు (Best Actor) వస్తుందని ఎవరూ ఊహించలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు నిజంగా అది గర్వకారణంగా నిలిచిన క్షణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగుతోంది. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ పరిశ్రమను చూసే కోణమే మారిపోయింది. అసలు రావని అనుకున్న అవార్డ్స్ కూడా టాలీవుడ్‌కు చెందిన చిత్రాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి నేషనల్ అవార్డు కనుక ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్‌కి వస్తే మాత్రం.. ఆయన రేంజ్ పెరగడమే కాదు, టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పినట్లుగా కూడా అవుతుంది.
కాకపోతే ఈసారి చాలా గట్టిపోటీ ఉంది. ఆ పోటీని తట్టుకుని.. ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డు కొడితే మాత్రం.. తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచే పేరులో ఆయన పేరు నిలిచిపోతుంది. 69వ నేషనల్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, 70వ ఎడిషన్‌లో ‘కాంతార’ చిత్రానికిగానూ రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇక 71వ ఎడిషన్‌లో ఈ అవార్డును ఇద్దరు పంచుకున్న విషయం తెలిసిందే. వారిద్దరూ బాలీవుడ్ నటులే కావడం గమనార్హం. ‘జవాన్’ చిత్రానికిగానూ షారుఖ్ ఖాన్, ‘12th ఫెయిల్’ చిత్రానికిగానూ విక్రాంత్ మస్సె సంయుక్తంగా ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు 72వ ఎడిషన్‌లో బెస్ట్ యాక్టర్‌గా ఎవరూ నిలుస్తారో చూద్దాం..
ఇవి కూడా చదవండి:
‘రావు బహదూర్’.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు
‘జైలర్ 2’కి పోటీగా.. చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ అప్పుడేనా!
మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం.. హీరో ఎవరంటే