Nani: నా బిగినింగ్స్ లో ఒక పేజీ నీది... నీ రీ బిగినింగ్స్ లో ఒక పేజీ నాది...
ABN, Publish Date - Nov 19 , 2026 | 07:54 AM
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. నాని నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నితిన్ (Nithiin) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini). నాని (nani) నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో ఇతర చిత్రాలు కూడా పోటీలో ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు నాని తనకున్న క్రేజ్‌తో సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా పాట విడుదల కార్యక్రమంలో నాని, నితిన్ కలిసి సందడి చేశారు. ఇద్దరూ ఒకే వేదికపై కాలు కదుపుతూ స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుపు రంగు దుస్తుల్లో కనిపించిన ఈ ఇద్దరు హీరోలు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘గతంలో నితిన్ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. 'నా బిగినింగ్స్‌లో ఒక పేజీ నీది.. నీ రీబిగినింగ్‌లో ఒక పేజీ నాది'’ అని అన్నారు. నాని మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా నితిన్ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నాని.. ఇప్పుడు అదే నితిన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువ కథానాయకుల మధ్య ఉన్న అనుబంధానికి ఈ వేడుక వేదికగా నిలిచింది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, ఆఫియా సయ్యద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ALSO READ:
అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే
‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?