సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Nagarjuna: ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి

ABN, Publish Date - Oct 16 , 2026 | 07:54 PM

అనీష్ (Aniesh Reddy), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా మహేష్ ఉప్పాల (Mahesh Uppala) దర్శకత్వం వహించిన చిత్రం ఇట్లు అర్జున.

Akkineni Nagarjuna

అనీష్ (Aniesh Reddy), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా మహేష్ ఉప్పాల (Mahesh Uppala) దర్శకత్వం వహించిన చిత్రం ఇట్లు అర్జున. అక్కినేని నాగార్జున సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించాడు. ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ఇండస్ట్రీ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. 'ఈమధ్య ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమాలు బాగా ఆడుతున్నాయి.ఈ ఏడాది నుండీ జనాలు చేస్తుంది.. ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద లెసన్. చిరంజీవి గారు కానీ, నేను కానీ 4 దశాబ్దాల క్రితం వచ్చాం. మేము ఒక కల్చర్ కి అలవాటు పడ్డాము.. అందుకే మేము ఇలా చేయగలగుతున్నాము. కానీ, ఇప్పుడు అలా లేదు' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ' అనీష్ ఈజ్ తోఎక్కడ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. పక్కనే అనస్వర లాంటి అద్బుతమైన నటి ఉండగా మూగవాడి పాత్రలో నటించటం ఈజీ కాదు. అనీష్ బాడీ లాగ్వెంజ్ తోనే యాక్టింగ్ చేశాడు. ఈ చిత్ర దర్శకుడు తీసిన సినిమా ఆర్జీవి తీసిన క్షణం క్షణం ను గుర్తికు తెచ్చింది‌. ఈ సినిమాను ఇష్టంతో సమర్పిస్తున్నాను. ఆబ్లిగేషన్ తో చేయటం లేదు. అది మాకు అవసరం లేదు. అబ్లిగేషన్ తో సినిమాలు ఆడవు..సినిమా బాగుంటేనే ఆడుతుంది' అని తెలిపాడు. ఇక ఇట్లు అర్జున సినిమా అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 16 , 2026 | 07:54 PM