సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అంతా అతడిని ‘చింటు అన్నా’ అని పిలుస్తారట కదా..: నాగార్జున

ABN, Publish Date - Jul 06 , 2026 | 06:56 PM

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నాగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nagarjuna and Naga Vamsi

అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) నిర్మించిన చిత్రం ‘లెనిన్’ (Lenin). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 10న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఆదివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున ‘చింటు’ (Chintu) అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


టాలీవుడ్‌లో ‘చింటు’ అని ఎవరిని పిలుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ ఆ పర్సన్ ఎవరో తెలుసు. కొందరు ట్రోలింగ్ చేస్తారు. కొందరు ప్రేమగా అన్నా అని పిలుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే, ఇటీవల ‘మాస్ జాతర’ ప్రమోషన్స్‌లో మాస్ మహారాజా రవితేజ డైరెక్ట్‌గా చింటూ అంటూ ఆ పర్సన్‌ని ఆటపట్టించిన వీడియోస్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇంకా అర్థం కాలేదా.. ఆ చింటూ ఎవరో కాదు.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అవును.. నిర్మాత నాగవంశీని అంతా ‘చింటు’ అని పిలుస్తుంటారు. నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయనని అలాగే పిలుస్తుంటారు. ఇక నాగార్జున ‘చింటు’ అని పబ్లిక్‌ ఫంక్షన్‌లో పిలవడంతో మరోసారి ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


‘ఈ సినిమాకు నాకో పార్ట్‌న‌ర్ ఉన్నాడు.. మీరంతా చింటు అన్న అని పిలుస్తారట క‌దా అత‌డిని..’ అంటూ కింగ్ నాగార్జున అనడంతో ఒక్కసారిగా ఆడిటోరియం అరుపులు, కేకలతో హోరెత్తింది. నాగార్జున అలా అనడంతో షాక్ అయిన నాగవంశీ.. ఆ తర్వాత కూల్‌గా నవ్వుకున్నారు. ఇంకా నాగవంశీని ఉద్దేశిస్తూ.. ‘‘ఈ సినిమా విష‌యంలో అఖిల్‌కు, నాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తనే అన్నీ చూసుకున్నాడు. చింటు అన్న‌కి మాస్ పల్స్ గురించి బాగా తెలుసు. ఈ మూవీపై ఉన్న నమ్మకంతో చింటు అన్న ఏపీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే.. ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి’’ అంటూ కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:

‘లెనిన్’ కోసం గర్జించిన యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కు పండగే!

Madhavan: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడమే నా గోల్

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు: ప్రకాష్ రాజ్‌పై బండ్ల ఫైర్

Updated Date - Jul 06 , 2026 | 06:57 PM