సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!

ABN, Publish Date - Jun 27 , 2026 | 06:58 PM

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’. ఈ మూవీకి సంబంధించి అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

Nagabandham Movie Still

విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’ (Nagabandham). నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో, ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకేలా మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఈ పాజిటివ్ వైబ్స్ సినిమా ప్రీ-రిలీజ్ బజ్‌ను భారీగా పెంచేయడంతో.. అన్ని ఏరియాల్లో ఈ సినిమా హాట్ కేకులా అమ్ముడవుతోంది.


ఈ చిత్ర రైట్స్‌ని దక్కించుకునేందుకు అగ్ర డిస్ట్రిబ్యూటర్స్‌ లైన్‌లోకి రావడం చూస్తుంటే.. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయడం ఖాయమని అనిపిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా భారీ స్థాయిలో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ చేయడం.. ఈ ప్రాజెక్ట్‌పై డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర డిస్ట్రిబ్యూటర్స్ (Nagabandham Distributors) ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ ధరలకు సొంతం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..


నైజాం, వైజాగ్ ఏరియా హక్కులు - దిల్ రాజుకు చెందిన ‘ఎస్వీసీ సినిమాస్’ (SVC Cinemas)

గుంటూరు- మెట్రో సురేష్‌కి చెందిన 'ఏబీవీఐ సినిమాస్' (ABVI Cinemas)

కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలు- సురేష్ మూవీస్

పశ్చిమ గోదావరి- ఆకర్ష్ సినిమాస్

నెల్లూరు- ఎస్ఏఎస్ ప్రమోటర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (సురేష్ మూవీస్)

సీడెడ్ (రాయలసీమ)- శ్రీ గురు రాఘవేంద్ర సంస్థ

నార్త్ ఇండియా, ఓవర్సీస్- జీ స్టూడియోస్' (Zee Studios)

కర్ణాటక- కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions)

తమిళనాడు- క్రౌన్ సినిమాస్

కేరళ- గుడ్ ఫెల్లాస్ ఎన్ ఫిలిమ్స్

ఇవి కూడా చదవండి:

Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..

Naga Chaitanya: నా కెరీర్‌లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే

వెంకీ, త్రివిక్రమ్ ‘ఏకే 47’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

Updated Date - Jun 27 , 2026 | 06:58 PM