వెంకీ, త్రివిక్రమ్ ‘ఏకే 47’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:45 PM

విక్టరీ వెంకటేష్ హీరోగా.. మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.

AK47 Movie Still

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా.. మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House no 47). ‘ఏకే 47’ అనేది ట్యాగ్‌లైన్. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్ర విడుదల తేదీని శనివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ పోస్టర్‌‌ని గమనిస్తే.. తన ఫ్యామిలీతో వెంకీ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. వెంకీ సరసన ‘కెజియఫ్’, ‘హిట్ 3’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పోస్టర్‌లో ఆమె లుక్‌ని కూడా రివీల్ చేశారు. ఇందులో ఇద్దరు పిల్లలకు తల్లిగా ఆమె కనిపిస్తున్నట్లుగా ఈ పోస్టర్‌ని చూస్తుంటే తెలుస్తోంది. అలాగే ఈ పోస్టర్‌లో వెంకీ ఫ్యామిలీని రెండు డిఫరెంట్ ఫొటోలతో చూపించిన విధానం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫొటో ఒక వైపు, రిచ్ ఫ్యామిలీ మరోవైపు చూపిస్తూ.. మేకర్స్ వదిలిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి తొలుత హర్షవర్దన్‌ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగినట్లుగా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్థానంలో ఎస్‌ఎస్‌ థమన్‌ వచ్చి చేరినట్లు వార్తలు రాగా, ఇప్పుడీ పోస్టర్‌లో థమన్ పేరు వేసి, ఆ విషయంలో కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం వెంకటేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అందులోనూ త్రివిక్రమ్ దర్శకత్వం కావడంతో.. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్‌ని అందుకుంటుందనేది తెలియాలంటే మాత్రం అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

మొన్ననే కలిసి ఫొటోలు దిగాం.. నమ్మలేకపోతున్నా: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

‘జననాయగన్‌’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!

సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ

Updated Date - Jun 27 , 2026 | 04:45 PM