సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాగవంశీ - రిషబ్ శెట్టి బిగ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..

ABN, Publish Date - Jul 29 , 2026 | 05:23 PM

కన్నడ విలక్షణ నటుడు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Rishab Shetty and Naga Vamsi

కన్నడ విలక్షణ నటుడు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty).. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) కాంబినేషన్‌లో ప్రకటించిన భారీ చారిత్రక చిత్రం రద్దయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ఆకాశవాణి’ చిత్రంతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) దర్శకత్వంలో 18వ శతాబ్దం నాటి కథాంశంతో ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాను నిర్మించనున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించి, ఇతర భాషల్లోకి డబ్ చేయాలని భావించిన ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు బడ్జెట్ ఇష్యూతో పక్కన పెట్టేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.


ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం రెమ్యూనరేషన్ వివాదమేనని తెలుస్తోంది. ‘కాంతార’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెచ్చిపెట్టిన గుర్తింపు, అపూర్వమైన విజయం తర్వాత.. రిషబ్ శెట్టి తన పారితోషికాన్ని భారీగా పెంచేశారని వార్తలు వస్తున్నాయి. సితార నాగవంశీ వద్ద ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌కు బడ్జెట్ అంచనాలు దాటిపోతోందట. సినిమాకు అయ్యే ఖర్చు, బిజినెస్ వర్కవుట్ అయ్యే అవకాశాలను బేరీజు వేసుకున్న నాగవంశీ, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం సాధ్యపడదని భావించి ఆపేయడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


ఈ ఊహించని పరిణామంతో దర్శకుడు అశ్విన్ గంగరాజు తన రెండవ సినిమా కోసం మళ్లీ కొత్త హీరో అన్వేషణలో పడ్డారు. మరోవైపు, రిషబ్ శెట్టి ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman) చిత్ర షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ భారీ పీరియాడిక్ డ్రామా ప్రకటనకే పరిమితమై, సెట్స్ మీదికి వెళ్లకుండానే రద్దవ్వడం ఇరు ఇండస్ట్రీల అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎవరితో ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే

సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!

‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

Updated Date - Jul 29 , 2026 | 05:23 PM