సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బ్రదర్స్ బాండింగ్ అంటే ఇది.. ‘లెనిన్’ హిట్‌పై చైతూ!

ABN, Publish Date - Jul 19 , 2026 | 07:09 PM

అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్.. మధ్య ఉన్న అనుబంధం గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అనుబంధం మరోసారి పబ్లిగ్గా తెలిసేలా చైతూ స్పీచ్ ఇచ్చారు.

Chaitu about Lenin

అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil Akkineni).. మధ్య ఉన్న అనుబంధం గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఒక ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న యువసామ్రాట్ నాగచైతన్య, తన తమ్ముడు అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ‘లెనిన్’ (Lenin) సాధించిన భారీ విజయంపై స్పందించారు.


ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ.. ‘‘మొన్న నా తమ్ముడు అఖిల్ సినిమా ‘లెనిన్’ థియేటర్లలో విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాను అంత పెద్ద సక్సెస్ చేసినందుకు, అఖిల్‌కు అంతటి ఘన విజయాన్ని అందించినందుకు మీ అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమ్ముడి సినిమా విజయాన్ని ఓ అన్నగా వేదికపై పంచుకోవడం అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.


ఇదే వేదికపై తన రాబోయే క్రేజీ మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma) గురించి కూడా నాగచైతన్య హింట్ ఇచ్చారు. ‘‘త్వరలోనే నా సినిమా ‘వృషకర్మ’తో మిమ్మల్ని అందరినీ థియేటర్లలో కలుస్తాను’’ అని అభిమానులకు మాటిచ్చారు. కార్తీక్ దండు దర్శకత్వంలో చైతన్య నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అక్కినేని హీరోలందరూ నటించిన ‘మనం’ తరహాలో.. మరోసారి కింగ్ నాగార్జున (King Nagarjuna), నాగ చైతన్య, అఖిల్ కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ ఈ మధ్య అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. మంచి సబ్జెక్ట్ కుదిరితే.. తప్పకుండా చేస్తామని ఈ అక్కినేని హీరోలు కూడా అభిమానులకు మాటిచ్చారు. చూద్దాం.. అభిమానులకు ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో..

ఇవి కూడా చదవండి:

ప్రథమ్ సంకల్ప్.. ‘రామాయణ’ మహా ప్రయాణానికి శ్రీకారం

72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

Updated Date - Jul 19 , 2026 | 07:09 PM