సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nag Ashwin: ప్రభాస్‌ ‘కల్కి 2’ షూటింగ్ పై దర్శకుడు నాగ్ అశ్విన్‌ క్లారిటీ..

ABN, Publish Date - Sep 01 , 2026 | 08:59 AM

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ పై దర్శకుడు కీలక అప్డేట్ ఇచ్చారు

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ (Kalki 2) ఒకటి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై మొదటి భాగం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘కల్కి 2’కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్‌ మాత్రమే పూర్తయిందని నాగ్‌ అశ్విన్‌ వెల్లడించారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందనే విషయం స్పష్టమైంది. ప్రభాస్‌ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తన మిగతా సినిమాల కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘కల్కి 2’ తదుపరి షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథ, పురాణ అంశాలు, అత్యున్నత స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధించిన అంశాలను చూపించడంతో ‘కల్కి 2’పై ఆసక్తి మరింత పెరిగింది. మొదటి భాగంలో ప్రభాస్‌ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా మెప్పించారు. కమల్‌ హాసన్‌ యాస్కిన్‌ పాత్రలో కనిపించి సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. ఈ ముగ్గురు నటులు సీక్వెల్‌లో కీలకంగా ఉండనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

ALSO READ: రంభలో ఆ జోష్‌ ఇంకా తగ్గలేదే.. తలకు టవల్‌తో ఫుల్ ఎనర్జీ డ్యాన్స్‌!

శివన్నలో మరో యాంగిల్.. ఆసక్తికరంగా ‘కూర్మ అవతార్‌’ టీజర్ 




Updated Date - Sep 01 , 2026 | 09:33 AM