సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బహిరంగంగా ఆమెకి క్షమాపణ చెప్పిన నభా నటేష్

ABN, Publish Date - Nov 21 , 2026 | 07:11 PM

అందాల తార నభా నటేష్ (Nabha Natesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ప్రస్తుతం పలు క్రేజీ పాన్-ఇండియా సినిమాలతో బిజీగామారింది.

Nabha Natesh

అందాల తార నభా నటేష్ (Nabha Natesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ప్రస్తుతం పలు క్రేజీ పాన్-ఇండియా సినిమాలతో బిజీగామారింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభు (Swayambhu)ఆమె కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నభా, తాజాగా తన తల్లికి బహిరంగంగా క్షమాపణలు చెప్పుకొచ్చింది. అది ఆమె ఫన్నీగానే పెట్టినా కూడా ప్రతి కూతురు కూడా దానికి కనెక్ట్ అవుతారు. ఏ విషయంలో అయినా తల్లినే కరెక్ట్ అని, ఆమె మాటలు వినకుండా ఉన్నందుకు తాను ఇప్పుడు బాధ పడుతున్నట్లు తెలిపింది. అందుకే సోషల్ మీడియా ద్వారా అమ్మకి సారీ అంటూ పోస్ట్ పెట్టింది.


'ఇటీవల నాకు తెలిసొచ్చిన ఒక నిజాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మ సలహాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకుండా, నాకే ఎక్కువ తెలుసని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పడం లేదు.. మా అమ్మ చెప్పేది కరెక్టే. ఏం తినాలి, ఎప్పుడు పడుకోవాలి, అతిగా ఆలోచించడం ఎప్పుడు ఆపాలి.. ఆఖరికీ నా కడుపు సహకరించనప్పుడు ఏం చేయాలి అన్నదానికీ అమ్మ దగ్గర సమాధానం ఉంటుంది. కానీ నేనేం చేస్తాను? గూగుల్‌లో వెతుకుతాను, రీల్స్ చూస్తాను, ఫ్రెండ్స్‌ని అడుగుతాను, ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తాను. మొదట అడగాల్సిన అమ్మను తప్ప అందరినీ అడుగుతాను' అంటూ తన అలవాట్లను ఎంతో సహజంగా, ఫన్నీగా రాసుకొచ్చింది.


అంతేకాకుండా, అందరి ముందు ఈ నిజాన్ని ఒప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నా ఈసారి కూడా అమ్మే కరెక్ట్ అని అంగీకరించింది. అమ్మ మాట విననందుకు ఇది తన బహిరంగ క్షమాపణ అని పేర్కొంటూ, 'నేను ముందే చెప్పాను కదా' అనేలోపే... సారీ అమ్మా!' అంటూ హార్ట్ ఎమోజీతో ఈ పోస్ట్‌ను ముగించింది. ప్రతి ఇంట్లో అమ్మ సలహాలను పట్టించుకోకుండా తర్వాత రియలైజ్ అయ్యే యువతకు ఈ పోస్ట్ బాగా కనెక్ట్ అవుతుండటంతో, నెటిజన్లు లైకులు, కామెంట్లతో దీన్ని వైరల్ చేస్తున్నారు.

Updated Date - Nov 21 , 2026 | 07:11 PM