సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramba Oorvasi Menaka: నా కంటి మీద కునుకే .. ఊర మాస్ సాంగ్ అంతే

ABN, Publish Date - Jul 22 , 2026 | 07:12 PM

ఒకప్పుడు ఇండస్ట్రీలో అల్లరి నరేష్ (Allari Naresh) రేంజ్ వేరు.. ఏడాదికి నాలుగైదు సినిమాల చేస్తూ నిర్మాతల పాలిట ప్రామిసింగ్ హీరోగా ఉన్నాడు. కానీ, ఇప్పుడు మొత్తం మారిపోయింది.

Ramba Oorvasi Menaka

ఒకప్పుడు ఇండస్ట్రీలో అల్లరి నరేష్ (Allari Naresh) రేంజ్ వేరు.. ఏడాదికి నాలుగైదు సినిమాల చేస్తూ నిర్మాతల పాలిట ప్రామిసింగ్ హీరోగా ఉన్నాడు. కానీ, ఇప్పుడు మొత్తం మారిపోయింది. మునుపటి రేంజ్ ను సంపాదించుకోవడానికి నరేష్ చాలా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన నటిస్తున్న తాజా చిత్రం రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka). చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా రంభ ఊర్వశి మేనక చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నా కంటి మీద కునుకే ఎగిరొచ్చినది వెనకే.. ఒక్క ముద్దుతో గలాటా పెట్టినావు గనకే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లిరిక్స్ చాలా క్యాచీగా, రొమాంటిక్ రిథమ్‌తో అలరిస్తున్నాయి. అల్లరి నరేష్, సురభిల మధ్య ఉండే కెమిస్ట్రీని ఈ పాటలో కలర్‌ఫుల్‌గా చూపించారు. ముఖ్యంగా పాటలోని ట్యూన్, పదాల కూర్పు మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. భాస్కరభట్ల రవికుమార్ అందించిన లిరిక్స్ ని ధనుంజయ్ తన గాత్రంతో అద్బుతంగా ఆలపించాడు.


విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అల్లరి నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. రీఎంట్రీ తరువాత సపోర్టింగ్ రోల్స్, సీరియస్ పాత్రల్లో కనిపించిన నరేష్.. మళ్లీ వెనక్కి వెళ్లి కామెడీ కథతో మెప్పించడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jul 22 , 2026 | 07:36 PM