‘ముసలోడికి దసరా పండుగ’.. ఎప్పుడంటే?

ABN , Publish Date - May 13 , 2026 | 04:47 PM

ప్రేక్షకులు థియేటర్లకు వస్తే.. రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ‘ముసలోడికి దసరా పండుగ’ చిత్రం ఉంటుందని అన్నారు చిత్ర నిర్మాత రమణ వాళ్లె.

Musalodiki Dasara Panduga Movie Poster

రాజీ నాయుడు - సీత‌మ్మ వాళ్లె ఆశీస్సుల‌తో రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై.. నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’ (Musalodiki Dasara Panduga). విలక్షణ నటుడు నాజర్ (Nassar) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్ర‌వారం (మే 15న‌) థియేట‌ర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో.. వార్తలలో నిలిచిన ఈ చిత్రం.. నాన్‌స్టాప్ నవ్వులు పూయించేందుకు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ‘చాలా కాలం త‌ర్వాత’ తెలుగు తెర‌పైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్న ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. (Musalodiki Dasara Panduga Release Date)


ఈ సంద‌ర్భంగా నిర్మాత రమణ వాళ్లె (Ramana Valle) మాట్లాడుతూ.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తే.. రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లం. ఈ సినిమాను మా పితృ స‌మానులైన దివంగ‌త ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు అంకిత‌మిస్తున్నామని తెలిపారు. నాజర్‌తో పాటు అంజలి (Anjali), అనిత (Anitha) (‘నువ్వు నేను’ ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య వంటి వారంతా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలను పోషించారు.

ఇవి కూడా చదవండి:

రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం

పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ

అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను

తన తొలి సినిమా హీరో విజయ్‌ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!

Updated Date - May 13 , 2026 | 04:48 PM