సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనిల్ రావిపూడి.. అసలు ఏం టాలెంటయ్యా నీది

ABN, Publish Date - Oct 05 , 2026 | 05:41 PM

తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత దర్శకుడిగా మారి పరాజయమే ఎరుగని ట్రాక్ రికార్డుతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Anil Ravipudi

తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత దర్శకుడిగా మారి పరాజయమే ఎరుగని ట్రాక్ రికార్డుతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). పటాస్ నుంచి మణ శంకరవరప్రసాద్ గారు వరకు వరుస బ్లాక్‌బస్టర్లు అందిస్తూ బాక్సాఫీస్ వద్ద విజయాకి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. అయితే అనిల్ రావిపూడి కేవలం ఒక విజయవంతమైన దర్శకుడు మాత్రమే కాదు.. హీరోలా మెయింటెన్ చేసే లుక్స్, ప్రొఫెషనల్ డ్యాన్స్, మిమిక్రీ వంటి అనేక రంగాల్లో ప్రవేశమున్న మల్టీ టాలెంటెడ్ ప్యాకేజ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


తాజాగా ఈ ఆల్ రౌండర్ డైరెక్టర్ బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న సింగింగ్ రియాలిటీ షో సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే. ఈ వేదికపై అనిల్ సరికొత్తగా సింగర్ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో కలిసి వేదికపై సందడి చేస్తూ, తమ స్నేహబంధాన్ని వేడుక చేసుకుంటూ వేదికపై పవర్-ప్యాక్డ్ ఫ్రెండ్‌షిప్ సాంగ్ పాడాడు. దళపతి సినిమాలోని సింగరాల పైరుల్లోనా సాంగ్ ను ఇద్దరూ అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ పర్‌ఫార్మెన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


పాట ప్రారంభంలో అనిల్ రావిపూడి పాడిన తీరు, ఆయన శైలి హ్యూమరస్‌గా ఉండటంతో పాటు ప్రముఖ యాంకర్/నటుడు సుడిగాలి సుధీర్ వాయిస్‌ను తలపించిందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక అనంత శ్రీరామ్ తన మధురమైన స్వరంతో అనిల్ రావిపూడికి తోడవ్వడంతో ఆ ప్రదర్శన షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడిగా, రైటర్‌గా, డ్యాన్సర్‌గా, మిమిక్రి ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు సింగర్‌గా తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న అనిల్ రావిపూడి టాలెంట్ ని చూసి అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నావయ్యా అనిల్.. అదిరిపోయింది అంతే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ దర్శకత్వం వహిస్తోన్న జనవరి 12 విడుదల వచ్చే సంక్రాంతి బరిలో దిగుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్

‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

పాత్రకు జీవం పోసేందుకు.. నటీనటుల్లో తరగని నటనాభిలాష!

Updated Date - Oct 05 , 2026 | 05:41 PM