సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కృష్ణ కొడుకుతో సినిమా తీసినా.. ఎన్టీఆర్‌ని ఏమైనా అంటే నేనే కొడతా: MS రాజు

ABN, Publish Date - Aug 12 , 2026 | 11:19 PM

నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్. రాజు ఇటీవల తను రూపొందించిన ‘అగధ’ చిత్ర వేడుకలో నందమూరి తారకరామారావు పై చేసిన వ్యాఖ్యలు వివాదమవుతోన్న విషయం తెలిసిందే.

MS Raju about NTR

నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్. రాజు (MS Raju) ఇటీవల తను రూపొందించిన ‘అగధ’ (Agadha) చిత్ర వేడుకలో నందమూరి తారకరామారావు (NT Ramarao)పై చేసిన వ్యాఖ్యలు వివాదమవుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బ్రహ్మముహూర్తంలో లేచి, ఏం చేసేవారో తెలుపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన క్లారిటీ ఇచ్చారు. తానెప్పుడూ ఎన్టీఆర్‌కి డైహార్డ్ ఫ్యాన్ అని.. ఆయన విధానాలను, క్రమశిక్షణను ఎంతగానో గౌరవిస్తానని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా ఎమ్.ఎస్. రాజు మాట్లాడుతూ.. ‘‘నేను సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడైన మహేష్ బాబుతో ‘ఒక్కడు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసినప్పటికీ, నా చిన్నతనం నుంచి నేను సీనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని. నా చిన్నతనంలో ఎన్టీఆర్‌ను ఎవరైనా ఒక్క మాట అన్నా తహతహలాడిపోయేవాడిని.. ఇంకా కోపంతో కొట్టేంత అభిమానం ఉండేది. ఇప్పటికైనా సరే.. ఎవరైనా ఎన్టీఆర్‌ని నా ముందు తక్కువ చేసి మాట్లాడితే నేనే కొడతా. నా నోట ఆయన పేరు తప్ప వేరే ఏదీ రాదు. ఎన్టీఆర్ సాధించిన విజయం, ఆయన వ్యక్తిత్వం నాకు ఎప్పుడూ ఒక ప్రేరణ’’ అని పేర్కొన్నారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కామెంట్లు, కథనాలపై స్పందిస్తూ... ఎన్టీఆర్‌ను అనుకరించడం లేదా ఆయన గురించి మాట్లాడటం ఆయనను అవమానించడం కాదని, ఆ మహానటుడిని స్ఫూర్తిగా తీసుకోవడమేనని క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అంటే మాములు విషయం కాదని, ఇప్పుడెవరూ అలాంటి వారు లేరని, ఆయన చాలా గొప్పవారని అన్నారు. ఆయన వారసత్వం, విజయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఎన్టీఆర్‌పై తనకున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ తగ్గవని ఎమ్.ఎస్. రాజు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎమ్.ఎస్. రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

ఇవి చదవండి:

బాక్సాఫీస్‌ పోరులో ‘సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు?

రౌడీ వేర్ బ్రాండ్‌కు ఫ్యాన్స్‌గా డైరెక్టర్స్.. విజయ్ క్రేజ్ ఇది!

నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా.. హీరోయిన్ జో శర్మకు నాఫా అవార్డ్

Updated Date - Aug 12 , 2026 | 11:19 PM