Mr. Work From Home: మోదీ నోట ‘వర్క్ ఫ్రమ్ హోమ్’... భలే నచ్చింది!
ABN , Publish Date - May 14 , 2026 | 03:19 PM
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ ఈ నెల 15న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ థియేట్రికల్ గా ముత్యాల రాందాసు విడుదల చేస్తున్నారు.
యంగ్ హీరో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీని అరవింద్ మండెం నిర్మించారు. ఈ నెల 15న 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమాను ముత్యాల రామ్ దాస్ వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ, 'ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. మార్నింగ్ షో విషయం ఏంటో తెలియదు గానీ, టాక్ బయటకు వస్తే సినిమా గురించి మీకే తెలుస్తుంది. చాలా మంచి టీమ్‌తో కలిసి నిజాయితీగా చేసిన సినిమా ఇది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. మొన్ననే ప్రధాని మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు? అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం' అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ రాందాస్ మాట్లాడుతూ, 'ఈరోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందులో చిన్న సినిమా అంటే ఇంకా రిస్క్ ఉంటుంది. అయితే ఈ సినిమాను చాలా క్వాలిటీతో తీశారు. మోదీజీ కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహించారు. ఆయన మాట ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. ఇది యూత్ సినిమా, సమ్మర్ సినిమా. యువత చూస్తే ఈ మూవీ ఖచ్చితంగా చాలా మంచిగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం' అని చెప్పారు. నిర్మాత అరవింద్ మాట్లాడుతూ, 'మన ప్రధాని మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీకు నచ్చితే పదిమందికి చెప్పండి. అప్పుడే ఇలాంటి మంచి కథలు వస్తాయి' అని అన్నారు.
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ, 'జీవితంలో ఏం చేసినా పెద్దవాళ్లను గౌరవించాలని చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు. ఆయన ఎందుకు ఆ మాట చెప్పారో ఈరోజు నాకు అర్థమైంది. మా నాన్న చెప్పిన మాట ఈరోజు నిజమైంది. రాందాస్ గారు లేకపోతే ఈ సినిమా బయటకు వచ్చి ఇంతమందిని అలరించేది కాదు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగు తున్నాను. ఇది సమ్మర్ సినిమా. అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం. ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా మీ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, నటులు అనీశ్ కురవిల్లా, గుండు సుదర్శన్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!
ట్రెండింగ్‌లో మహేష్ బాబు కొడుకు పాట.. హిట్టు కొడుతున్నట్టేనా?
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్