మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా?
ABN, Publish Date - Jul 10 , 2026 | 02:42 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మోక్షు ఎంట్రీకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటవారసుడు మోక్షజ్ఞ (Mokshagna) వెండితెర అరంగేట్రం కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో ‘హను-మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ప్రచారం సాగినప్పటికీ, అది చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. ఆ తర్వాత తనయుడి లాంచ్ బాధ్యతలను స్వయంగా బాలకృష్ణే భుజానకెత్తుకున్నారు. నందమూరి బ్రాండ్‌కు తగ్గట్టుగా, స్వయంగా తానే ఒక పవర్‌ఫుల్ లైన్‌ను సిద్ధం చేసి, స్క్రిప్ట్ వర్క్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పర్యవేక్షిస్తున్నారు.
అయితే, తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఎంట్రీ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక ఊహించని టాక్ నడుస్తోంది. బాలయ్య సిద్ధం చేసిన కథాంశానికి సందీప్ వంగా తనదైన మేకింగ్ స్టైల్‌ను జోడిస్తున్నారని వినికిడి. ముఖ్యంగా క్యారెక్టరైజేషన్లు, కథనంలో తన మార్క్ ఇంటెన్సిటీని, ఎమోషన్స్‌ను పీక్స్‌లో ఉండేలా వంగా స్క్రిప్ట్‌కు పదును పెడుతున్నట్లు సమాచారం. ఒక స్టార్ వారసుడి ఎంట్రీ అంటే ఉండే అంచనాలను అందుకోవడానికి కేవలం కథ మాత్రమే సరిపోదు.. దాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే స్క్రీన్‌ప్లే కావాలి. అందుకే, బాలకృష్ణ కూడా వంగా లాంటి క్రియేటివ్ మైండ్ ఇన్‌పుట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టాక్ గనుక నిజమైతే, సందీప్ రెడ్డి వంగా ఎంట్రీతో ఈ సినిమాకు ప్రాంతీయ సరిహద్దులు దాటి పాన్-ఇండియా రేంజ్ క్రేజ్ రావడం ఖాయం. వంగా అందించే కరెక్షన్స్ వల్ల సినిమాకు అల్ట్రా-మాస్ అప్పీల్‌తో పాటు, క్లాస్ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించే ఎలిమెంట్స్ తోడవుతాయనడంలో సందేహం లేదు. నందమూరి అభిమానులు థియేటర్లలో ఏ రకమైన విస్ఫోటనాన్ని చూడాలనుకుంటున్నారో.. దానికి తగ్గట్టుగానే ప్రతి అడుగును ఎంతో పక్కాగా, వ్యూహాత్మకంగా వేస్తోంది బాలయ్య టీమ్.
ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అటు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ఇక సందీప్ వంగా స్టైలిష్ అండ్ వైల్డ్ మేకింగ్ విజువల్స్.. నందమూరి వారసత్వపు సింహ గర్జనతో తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. మొత్తానికి నందమూరి అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఒక సాలిడ్ ప్రాజెక్ట్‌తో తెరపడనుందని స్పష్టమవుతోంది. అయితే, ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే.
ఇవి కూడా చదవండి:
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ
I, Nobody: పృథ్వీరాజ్ సుకుమారన్... ఐ, నోబడీ మూవీ రివ్యూ
ఇది చాలు సార్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న నిరంజన్ తండ్రి మాటలు