‘వారణాసి’.. కీలక అప్డేట్ ఇచ్చిన కీరవాణి
ABN, Publish Date - Jul 26 , 2026 | 09:33 PM
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ని కీరవాణి తెలియజేశారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమాకు సంబంధించి ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ పనుల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. సెప్టెంబర్ నెల నుంచి ‘వారణాసి’ నేపథ్య సంగీతం పనులను ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. (Varanasi Latest Update)
ఈ సందర్భంగా మాట్లాడిన కీరవాణి, సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ నుంచి తాను పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుని సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా జనవరి నాటికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులన్నింటినీ పూర్తి చేస్తానని వెల్లడించారు. జనవరి నాటికి మ్యూజిక్ వర్క్ పూర్తయితే, ఫిబ్రవరి నుంచి మిగిలిన నిర్మాణానంతర (పోస్ట్-ప్రొడక్షన్) పనులన్నీ శరవేగంగా జరుపుకుని ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
కంబైన్డ్ వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్‌కి కీరవాణి అందిస్తున్న సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా, కీరవాణి ఇచ్చిన ఈ తాజా షెడ్యూల్, రిలీజ్ టైమ్‌లైన్ అప్‌డేట్‌తో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, వినిపిస్తోన్న వార్తలు ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. కచ్చితంగా మరోసారి రాజమౌళి తన సత్తా చాటే చిత్రంగా ‘వారణాసి’ ఉంటుందని తెలుగు సినిమా ఇండస్ట్రీ నమ్ముతోంది.
ఇవి కూడా చదవండి:
అన్బరివ్ మూవీ కంటే ముందే ఆ దర్శకుడితో కమల్ క్రేజీ ఫిల్మ్!
‘స్పిరిట్’లో కత్రినా కైఫ్ రోల్ అదేనా?.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘RC17’ మొదలయ్యేది అప్పుడే!