సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

MEGAVERSE: చిరంజీవి .. ‘N’ మిస్సింగ్ సస్పెన్స్‌కు తెర

ABN, Publish Date - Nov 24 , 2026 | 12:20 PM

మెగాస్టార్ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపారు. ‘చిరంజీవి మెగావర్స్ – ఇది నా అడ్డా!’ పేరుతో సెలబ్రిటీ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. చిరంజీవి పేరులో మిస్సైన ‘N’ అక్షరం నెట్‌ఫ్లిక్స్‌ను సూచిస్తోందని కొత్త ప్రోమోతో వెల్లడించారు.

Chiranjeevi

అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ సెలబ్రిటీ టాక్‌షో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ‘చిరంజీవి మెగావర్స్ – ఇదే నా అడ్డా!’ (Chiranjeevi’s MEGAVERSE – Idhi Naa Adda!) అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేశారు. ఇప్పటివరకు వెండితెరపై తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. ఇప్పుడు హోస్ట్‌గా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ షోకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఓ ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి పేరును ఇంగ్లిష్‌లో ‘Chiranjeevi’ అని రాస్తే.. అందులోని ‘N’ అక్షరం మిస్ అయిందంటూ నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రత్యేకమైన ప్రచారాన్ని ప్రారంభించింది. దీంతో ఆ మిస్సింగ్ ‘N’ వెనుక ఉన్న రహస్యం ఏమిటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

తాజాగా ఆ ఉత్కంఠకు తెరదించుతూ నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్రోమోను విడుదల చేసింది. చిరంజీవి పేరులో మిస్ అయిన ‘N’ అక్షరం నెట్‌ఫ్లిక్స్‌ను సూచిస్తోందని సింబాలిక్‌గా వెల్లడించింది. ఈ సందర్భంగా మెగాస్టార్‌తో తమ మెగా కొలాబరేషన్‌ను అధికారికంగా ప్రకటించింది.

‘N’ వచ్చేసింది.. మెగా కొలాబరేషన్ కుదిరింది! అంటూ నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. మెగా నాస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు అన్నీ ఒకే చోట ఉండబోతున్నాయని తెలిపింది. ‘చిరంజీవి మెగావర్స్’ పేరుతో మెగాస్టార్ నెట్‌ఫ్లిక్స్ యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే షో ప్రారంభ తేదీతో పాటు ఇందులో పాల్గొనబోయే సెలబ్రిటీల వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మెగాస్టార్ హోస్ట్‌గా చేయబోతున్న ఈ టాక్‌షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ALSO READ:
ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి

Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు

ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు

Updated Date - Nov 24 , 2026 | 01:42 PM