మెగావర్స్.. ఏం కాంబినేషన్స్ రా బాబు.. హైప్ తోనే చంపేస్తున్నారు

ABN , Publish Date - Nov 04 , 2026 | 08:37 PM

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ 'మెగావర్స్’ (MegaVerse) టాక్ షోని మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆయన డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు అంటేనే హైప్ తో ఫ్యాన్స్ చచ్చిపోయారు.

MegaVerse

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ 'మెగావర్స్’ (MegaVerse) టాక్ షోని మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆయన డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు అంటేనే హైప్ తో ఫ్యాన్స్ చచ్చిపోయారు. ఇక ఆ టాక్ షోకి వచ్చే గెస్ట్ లిస్ట్ చూస్తుంటే ఒక్కొక్కరికి మతులు పోతున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఎప్పుడు చూడలేరు అనుకున్న కాంబినేషన్స్ అన్ని.. ఈ షోలో చూడబోతున్నారట ఫ్యాన్స్. ఆ రేంజ్ లో ఈ షోని ప్లాన్ చేస్తున్నారట.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న మెగావర్స్ మొదటి రెండు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా జరిగిపోయాయని అందరికీ తెల్సిందే. మొదటి ఎపిసోడ్ లో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, సునీల్ తో చిరు రచ్చ రచ్చ చేశారట. ఇక రెండో ఎపిసోడ్ లో లోక నాయకుడు కమల్ హాసన్ తో ఎన్నో జ్ఞాపకాలను చిరు పంచుకున్నారట. ఇవన్నీ వింటుంటూనే ఎప్పుడెప్పుడు ఈ షో స్ట్రీమింగ్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు కదా.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయట. ఆ రెండు ఎపిసోడ్స్ కి వచ్చే స్టార్స్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.


షోలో మల్టీస్టారర్ కాన్సెప్ట్‌లో భాగంగా ఇండస్ట్రీలోని ప్రముఖ సినీ కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలతో భారీ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నారట. ఈ మెగావర్స్ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలసి ఒక పవర్‌ఫుల్ ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నారని టాక్. బాబాయ్-అబ్బాయ్ కాంబోలో రాబోతున్న ఈ ఎపిసోడ్ ఈ టాక్ షోకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, వీరి ముగ్గరు స్క్రీన్ ప్రెజెన్స్ వెండితెరపై, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీతో మరొక అద్బుతమైన ఎపిసోడ్‌ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. కింగ్ అక్కినేని నాగార్జున, యువ సమ్రాట్ నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ల కలయికలో ఈ ఎపిసోడ్ రూపుదిద్దుకోనుందట. తండ్రి, ఇద్దరు కొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్న ఈ అక్కినేని ఎపిసోడ్ షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభం కానుందని లేటెస్ట్ సమాచారం. ఒకే వేదికపై ఇలాంటి స్టార్ ఫ్యామిలీస్ కలసి రావడం టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా లెవెల్‌లో బిగ్గెస్ట్ మైలురాయిగా మారనుంది. ఈ వారంలో జరగబోయే అక్కినేని ఫ్యామిలీ ఎపిసోడ్ షూటింగ్‌తో మెగావర్స్ కి సంబంధించిన అధికారిక వివరాలు, టీజర్ అప్‌డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలియడంతో మెగా, అక్కినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Medha Meka: మరో శ్రీలీలలా మారకమ్మా..

Allu Arjun: రామాయణ.. మన సంస్కృతికి ప్రతిబింబం

అది ధైర్యం కాదు.. నార్త్ భామలకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్

Updated Date - Nov 04 , 2026 | 08:45 PM