మెగా ఆశీస్సులు అందుకున్న ‘బంగారం’
ABN , Publish Date - Jun 22 , 2026 | 09:45 PM
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.43 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. సమంత నటన, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా సాధించిన అద్భుతమైన విజయానికిగాను చిత్ర యూనిట్‌కు ఊహించని మెగా సర్ప్రైజ్ లభించింది.
మెగాస్టార్ చిరంజీవి తనకు నచ్చిన సినిమా గురించి ట్వీట్ చేయడమే కాకుండా వారిని ఇంటికి పిలిచి సత్కరిస్తారు అన్న విషయం అందరికీ తెల్సిందే. తాజాగా మా ఇంటి బంగారం టీమ్ కి కూడా ఆ సత్కారం లభించింది. చిరంజీవి, సురేఖ మా ఇంటి బంగారం చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందినిరెడ్డిని.. చిరు అభినందించారు. సినిమా సాధించిన ఈ ఘన విజయం పట్ల వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్ మొత్తాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఎ మెగా బంగారం మూమెంట్ అంటూ పోస్ట్ చేసింది. మెగాస్టార్ లాంటి లెజెండ్ నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్ర బృందం ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది.
కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడకుండ సమంత ఆరోగ్యం గురించి కూడా చిరు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇక ఇంటికి వచ్చిన రాజ్ - సామ్ దంపతులకు చిరు- సురేఖ దంపతులు పట్టు వస్త్రాలతో పాటు బంగారు శంఖాన్ని బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సామ్ భర్త రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి మొదట చిరంజీవినే అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు. మరి ఈ కలయిక భవిష్యత్ లో ఏమైనా కుదురుతుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!
ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక