విడిపోయిన విజయ్ - త్రిష..

ABN , Publish Date - Jun 22 , 2026 | 08:38 PM

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ (Vijay), స్టార్ బ్యూటీ త్రిష(Trisha)ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Vijay- trisha

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ (Vijay), స్టార్ బ్యూటీ త్రిష(Trisha)ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ మంచి బాండింగ్ ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కలిసే వెళ్తున్నారు.. వస్తున్నారు. అందులో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఆ విడాకుల కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తోంది. ఈ విడాకుల తరువాత విజయ్ - త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.

అయితే అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒక్కటి అన్నట్లు.. విజయ్ - త్రిష పెళ్లి చేసుకుంటారు అనుకుంటే.. వారు విడిపోయారు అనే టాక్ రెండు ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. నేడు విజయ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులంతా పండగ చేసుకుంటుంటే, త్రిష మాత్రం ఆయనకు కనీసం బర్త్‌డే విషెస్ కూడా చెప్పకుండా కంప్లీట్ సైలెంట్‌గా ఉండిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి చిన్న విషయానికి స్పందించే త్రిష, విజయ్ బర్త్‌డే పోస్ట్‌ను స్కిప్ చేయడం వీరిద్దరూ విడిపోయారు అనే వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోంది.

త్రిష సైలెన్స్ వెనుక కోలీవుడ్ సర్కిల్స్ లో ఒక బలమైన కారణం వినిపిస్తోంది. విడాకులు తీసుకుంటారు అనుకున్న సంగీత, విజయ్ మళ్లీ కలిసిపోయారని, వారి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయనే వార్తలు జోరుగా వచ్చాయి. ఈ ప్యాచ్ అప్ వార్తల వల్లే త్రిష ఇప్పుడు విజయ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని, అందుకే ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకుండా సైలెంట్ మెయింటైన్ చేస్తోందని చెన్నై మీడియా కోడై కూస్తోంది.

విజయ్ తన ఫ్యామిలీ లైఫ్‌ను సెట్ చేసుకోవడం వల్లే త్రిష ఈ విధంగా దూరం జరుగుతోందంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు విజయ్ పుట్టినరోజు వస్తే అందరికంటే ముందుండే త్రిష, ఇప్పుడు ఇలా సైలెంట్‌గా మారిపోవడంతో వీరిద్దరి లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 08:41 PM