ఓమ్.. సాయిపల్లవి అన్ని కోట్లు తీసుకుందా

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:21 PM

ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా హిట్ పడితే హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచుతారు అనేది సాధారణం. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలో నటించే హీరోయిన్స్ అంతా పారితోషికం డిమాండ్ చేశారు.. ఇంత అడిగారు అని రూమర్స్ వస్తూనే ఉంటాయి.

Sai Pallavi

ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా హిట్ పడితే హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచుతారు అనేది సాధారణం. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలో నటించే హీరోయిన్స్ అంతా పారితోషికం డిమాండ్ చేశారు.. ఇంత అడిగారు అని రూమర్స్ వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నిజం అయ్యి ఉండవచ్చు.. ఇంకొన్ని పుకార్లు మాత్రమే అయ్యి ఉండవచ్చు. మొన్నటికి మొన్న అందాల భామ శ్రీనిధి శెట్టి.. ఆదర్శ కుటుంబం కోసం గట్టిగానే డిమాండ్ చేసిందని టాక్ నడిచింది. చివరకు ఆమె.. తనకంత సీన్ లేదని చెప్పడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది.


ఇక తాజాగా ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఓమ్ కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవి ఏకంగా రూ. 7 కోట్లు రెమ్యునరేషన్ పారితోషికంగా తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకునే సాయి పల్లవి, ధనుష్ సరసన ఇదివరకు మారి 2 లో నటించి రౌడీ బేబీ పాటతో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ కుదరడం, పైగా పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా నిర్మాతలు ఆమె అడిగిన భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడలేదని సమాచారం. సౌత్ ఇండియన్ సినిమాలో ఒక లేడీ ఓరియెంటెడ్ క్రేజ్ ఉన్న నటి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగా అరుదైన విషయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.


అయితే ఓమ్ లో సాయి పల్లవి నిత్యా రెడ్డి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఆమె పాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది. ధనుష్ సరసన శ్రీలీల కనిపిస్తుండగా.. సాయి పల్లవి ఒక కీలకమైన పాత్రలో కనిపించింది. ఆమె పాత్రనే సినిమాకి హైలైట్ కావడంతో అన్ని కోట్లు డిమాండ్ చేసిందని టాక్. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. రామాయణ, ఓమ్ నవంబర్ లోనే రిలీజ్ కానున్నాయి. రామాయణలో సీతగా కనిపించిన ఈ భామ ఆ పాత్ర కోసం కూడా భారీగానే డిమాండ్ చేసిందని టాక్. మరి ఈ సినిమాలతో ఆమె ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Also Read :

Radhika Apte: లెజెండ్.. ఆ సినిమా చూస్తేనే అసహ్యం వేస్తుంది

‘రామాయణ’.. ఐమ్యాక్స్‌ ట్రైలర్‌ చూసేయండి..

దివి పాప‌.. పిచ్చెక్కిస్తుందిగా

Updated Date - Nov 03 , 2026 | 05:25 PM