Jaya bachchan: అంతా అయిపోయాక మాట్లాడి ప్రయోజనం ఏంటి?

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:09 PM

‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వీకపూర్‌ క్యారెక్టర్‌ ఇష్యూ సోషల్‌ మీడియాతో మొదలై, బాలీవుడ్‌ సెలబ్రిటీలు మాట్లాడే వరకూ వెళ్లిపోయింది.

Janhvi kapoor and Jaya bachchan

‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వీకపూర్‌ క్యారెక్టర్‌ ఇష్యూ సోషల్‌ మీడియాతో మొదలై, బాలీవుడ్‌ సెలబ్రిటీలు మాట్లాడే వరకూ వెళ్లిపోయింది. ఇప్పటికే చాలామంది అచ్చియమ్మ పాత్ర తీర్చిదిద్దిన విధానాన్ని తప్పుబడుతూ కామెంట్లు చేశారు. ఆమె పాత్రను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని పలువురు అసహనం వ్యక్తం చేయడంతో దర్శకుడు బుచ్చిబాబు వివరణ ఇచ్చి, ఆయా సన్నివేశాలను తొలిగిస్తామని చెప్పారు. అయినా ఈ కామెంట్లు ఆగలేదు. ఇప్పుడు ఈ విషయంపై బాలీవుడ్‌ సీనియర్‌ నటి జయబచ్చన్‌ (jaya Bachchan) కూడా స్పందించారు. సినిమాల్లో హీరోయిన్‌లను గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారని, ఈ తీరు కరెక్ట్‌ కాదని ఆమె మండిపడ్డారు. ఏదైనా ప్రారంభంలోనే చూసుకోవాలని, సెట్‌లోనే ఇలాంటివాటిని  అడ్డుకోవాలని, అంతా జరిగిన తర్వాత మాట్లాడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గతంలో ఆమెకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఆమె చెప్పుకొచ్చారు.


‘షోర్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు నన్ను ఓ సీన్‌ కోసం గాగ్రా చోళీ వేసుకోవాలని కోరారు. దానిని ధరించాలంటే కచ్చితంగా చున్నీ ఉండాలని పట్టుబట్టాను. అందుకు దర్శకుడు అంగీకరించలేదు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సెట్‌లో క్యారెక్టర్‌ డిజైన్‌, డ్రెసింగ్‌ ఇలా ఏ విషయంలోనూ నాతో గీత దాటే  ప్రయత్నం ఎవరూ చేయలేదు. నన్ను అలా చూపించడానికి జరిగిన ప్రయత్నించిన అనుభవం అదొక్కటే. ఆ దర్శకుడితో మళ్లీ సినిమా చేయలేదు’ అని జయా బచ్చన్‌ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. సెట్‌లో ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే తిరగబడాలని.. అప్పుడే నటీమణులు అందరికీ చెప్పాను.



అయితే జయబచ్చన్‌ కామెంట్స్‌కు సపోర్ట్‌గా నిలిచారు కరీనాకపూర్‌. తెరపై అందంగా, ఆకర్షించేలా కనిపించడం, రొమాన్స్‌ కోసం అలాంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని కరీనా అభిప్రాయపడ్డారు. శ్రీదేవి, షర్మిలా ఠాగూర్‌, కాజోల్‌ వంటి గొప్ప నటీమణులు ఒంటినిండా దుస్తులు ధరించి ప్రేక్షకుల్ని వందశాతం అలరించారు అని ఆమె అన్నారు.

'మహిళలను సినిమాల్లో మాత్రమే  గ్లామర్ డాల్ లాగా చూస్తారని అనుకోవడం తప్పు. లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించినా, బస్సులో వెళ్లినా, రోడ్డుపై నడిచినా మహిళలు అనేక రకాల వేధింపులు, అనుచిత ప్రవర్తనను ఎదుర్కొంటుంటారు. తోపులాటలు, అసభ్య ప్రవర్తన వంటి ఘటనలు సమాజంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉన్నాయి. అందువల్ల  లేడీస్  ఆబ్జెక్టిఫికేషన్‌కు  సినిమాలే పూర్తి  బాధ్యత  అని నిందించడం  సరికాదు. ఇది సమాజంలోని విస్తృత సమస్య' అని కంగనా అన్నారు 

Updated Date - Jun 09 , 2026 | 03:19 PM