సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nani: బ్లడీ రోమియో.. నానికి హీరోయిన్ సెట్ అయినట్టేనా?

ABN, Publish Date - Sep 29 , 2026 | 11:02 AM

నాని వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం  'ది పారడైస్' సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆయన త్వరలో సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’  సినిమా చేయబోతున్నారు.

నాని (Nani) వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం  'ది పారడైస్' సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆయన త్వరలో సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ (bloody Romeo)  సినిమా చేయబోతున్నారు. 'ఓజీ' తర్వాత సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి పేరును  పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు  తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరోవైపు నాని అభిమానులు మాత్రం తమకు నచ్చిన హీరోయిన్ పేర్లను సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేస్తున్నారు.

మీనాక్షి చౌదరితో (Meenakshi Chowdhary) పాటు భాగ్యశ్రీ బోర్సే, మమితా బైజు, వామికా గబ్బి పేర్లు కూడా అభిమానులు సూచిస్తున్నారు. అయితే వీరిలో నాని సరేనా ఎవరు జోడి కడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మేకర్స్ దృష్టి మాత్రం మీనాక్షి చౌదరి పైనే ఉందని సమాచారం. నాని కోసం సుజీత్ ఎలాంటి కథను సిద్ధం చేశారు? ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని లుక్, క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించనున్నారు.  

ALSO READ:
NTR: తారక్‌ వస్తున్నాడంటే వైబ్స్ మామూలుగా ఉండవు..

బాలకృష్ణ విషయంలో మణిశర్మను తమన్ క్రాస్ చేస్తాడా!?

61 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కు.. సిద్ధమైన శివాజీ గణేశన్, సావిత్రి సినిమా

Updated Date - Sep 29 , 2026 | 11:39 AM