61 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కు.. సిద్ధమైన శివాజీ గణేశన్, సావిత్రి సినిమా

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:00 AM

ఇప్పటితరం ప్రేక్షకులకు పాత క్లాసిక్ సినిమాలను మళ్లీ పరిచయం చేస్తున్న రీరిలీజ్‌ల జాబితాలో మరో అద్భుత చిత్రం చేరింది.

Sivaji Ganesan Savitri Thiruvilaiyadal

ఏపీ నాగరాజన్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ (Sivaji Ganesan), సావిత్రి (Savitri), ముత్తురామన్, డీఎస్ బాలయ్య, నగేశ్ వంటి గొప్ప నటీనటులు నటించిన 'తిరువిలైయాడల్ (Thiruvilaiyadal) డిజిటల్ ప్రింట్లో రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ భక్తిరస చిత్రానికి కేవీ మహాదేవన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలు మారుమూల పల్లెలకు సైతం చేరడంతో విశేష ఆదరణ పొదాయి.

శివుడు పాత్రధారి శివాజీ గణేశన్, నాగేశన్‌కు మధ్య జరిగే సంభాషణలు, ప్రశ్నోత్తరాల ఘట్టాలు మరపురానివిగా మిగిలిపోయాయి. 'తిరువిలైయాడ అనే పురాణంలోని కొన్ని కథల ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై 61 యేళ్ళు పూర్తయిన సందర్భంగా డిజిటల్ ఫార్మె ట్లో కి మార్చి విడుదల చేయనున్నట్లు బాలవినాయగర్ పిక్చర్స్ అధినేత జి.లత వెల్లడించారు.

Updated Date - Sep 29 , 2026 | 10:07 AM