రాకేశ్‌ వర్రే 'మాయలేడి' నుంచి టైటిల్‌ సాంగ్

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:19 PM

రాకేశ్‌ వర్రె హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'మాయలేడి'. ఈ సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. విశాల్‌ చంద్రశేఖర్ స్వరపర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. రాకేశ్‌, మధుమిత సర్కార్ పై ఈ పాటను చిత్రీకరించారు.

Maya Lady Movie

యువ నటుడు, నిర్మాత రాకేష్ వర్రే తాజా చిత్రం 'మాయలేడి'. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో 'ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు' వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించారు. మధుమిత సర్కార్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రశంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.


తాజాగా 'మాయలేడి' మూవీ నుంచి మేకర్స్ టైటిల్ సాంగ్‌ ను రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన బాణీకి కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. సింగర్స్ అరవింద్ అనెస్ట్, శిబి శ్రీనివాసన్, వేలు, పిటీ విక్రమ్, దేవ్ మాత్యూ, కవిత ఇలంగో దీనిని పాడారు. 'మాయలేడి..' పాట ఎలా ఉందో చూస్తే - 'మాయలేడి చెంగు చెంగున దూకెరా, మాయలేడి గుండె ఠక్కున దోచెరా, మిస్టరీతో మంత్రమేదో వేసే కొత్తబొమ్మ మార్చెనేమో నన్నే, పక్కనుంటే తానే నచ్చుతుంది ఏంటో తెలియదుగా, ఎవడు వీడు అపరిచితుడు, అయినవాడల్లే ఉన్నాడు, చదువుతాడు, కనులే చూస్తూ ఉంటాడు..' అంటూ సాగే ఈ పాటను హీరో హీరోయిన్స్ మధ్య క్యూట్ లవ్ సాంగ్ గా చిత్రీకరించారు.

'ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కిందని, ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని ఇద'ని రాకేశ్‌ వర్రె తెలిపారు.

ALSO READ:

Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి

శంకర్ డైరెక్షన్‌లో అజిత్ సినిమా..  వర్కవుట్ అవుతుందా?'

Supriya: క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో 'పళ్ళ బురుసు'

Updated Date - Aug 11 , 2026 | 12:22 PM