Raviteja: బేసిక్ గా నాకు ఆ జబ్బు ఉంది..
ABN, Publish Date - Aug 24 , 2026 | 08:08 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఎట్టకేలకు నాలుగేళ్ల తరువాత మంచి విజయాన్ని అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు నాలుగేళ్ల తరువాత మంచి విజయాన్ని అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఎక్కడ చూసినా ఇరుముడి గురించే చర్చ. అసలు ఇదికదా రవితేజ సినిమా అంటే.. తండ్రీకూతుళ్ళు ఇలా కదా అని సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. రికార్డ్ కలక్షన్స్ తో దూసుకుపోతున్న ఇరుముడి సక్సెస్ ను మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. అనకాపల్లిలో జరిగిన ఇరుముడి సినిమా బ్లాక్‌బస్టర్ ప్రెస్ మీట్‌లో మాస్ మహారాజా రవితేజ చాలాకాలం తరువాత మంచి మూడ్ లో స్పీచ్ అదరగొట్టేశాడు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి అద్బుతంగా చెప్పుకొచ్చాడు.
అందరికీ గుడ్ ఈవెనింగ్.. . ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి మొదలుపెడతాను. భార్గవ్ గానీ, కిషోర్ గానీ, కొమరన్ గానీ.. శివ, నీ గొప్పతనం ఏంటంటే కొమరన్ చేత అలాంటి క్యారెక్టర్ చేయించడం నీ కాన్ఫిడెన్స్‌కి, కన్విక్షన్ కి నిదర్శనం. అందరూ చాలా చాలా బాగా చేశారు. గంజా బ్యాచ్ వంటి పాత్రలు చేసిన వాళ్లు బయట ఉండే తీరుకి, సినిమాలో వాళ్ల క్యారెక్టర్లకు అసలు సంబంధమే లేదు, చాలా బాగా చేశారు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. రమేష్ ఇంద్ర క్యారెక్టర్ గానీ, స్వాసిక కష్టం గానీ అద్భుతం. ఇవాళ స్వాసికకి జిమ్‌కి వెళ్లక్కర్లేదు, స్క్వాట్స్ అయిపోయాయి. కూర్చొని లేచి చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. రమేష్ ఇంద్ర బిజీగా ఉండి రాలేకపోయినట్టున్నారు. అజయ్ ఘోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఆయన బేసిక్‌గానే టెర్రిఫిక్ యాక్టర్. ప్రణిత, సామ్ అందరూ చాలా బాగా చేశారు. సామ్‌కి మంచి ఫ్యూచర్ ఉంది, విష్ యు ఆల్ ది బెస్ట్.
ఆర్ట్ డైరెక్టర్ సురేష్, మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ వర్క్ ఎక్స్ట్రార్డినరీ. ఆర్ట్ డైరెక్టర్లలో నాకు సాయి సురేష్ గానీ, నాగేంద్ర గానీ వీళ్లిద్దరూ చాలా ఇష్టం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. సురేష్, మనది ఇది మూడో సినిమా అనుకుంటా, బేసిక్‌గా నాకు మర్చిపోయే జబ్బు ఎక్కువ. అలాగే మా డీవోపి విష్ణు వర్క్ అమేజింగ్. కెమెరామన్, డైరెక్టర్ ఫ్రెండ్స్‌లాగా హ్యాపీగా తిరిగితే సినిమా బాగా వస్తుందని నమ్ముతాను. విష్ణులో నాకు నచ్చింది ఏంటంటే అతని పాజిటివ్ ఎనర్జీ, స్పీడ్. అలాగే దినేష్ నన్ను సీలేరులో చాలా బాగా చూసుకున్నాడు. అనంత శ్రీరామ్ గారు ఇందాక మాట్లాడింది మాత్రం అద్భుతం అండి. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసిన ముగ్గురు మాస్టర్లు చాలా బాగా చేశారు. పల్లకి సాంగ్‌కి శేఖర్, యాలోలే పాటకు శివ చేశారు. గతంలో రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ చేసినట్లు శివ కూడా కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఇక ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణులతో నేను చేసిన సినిమాలు 80% దాకా ఉంటాయి. క్లైమాక్స్, ఛేజ్ సీన్స్ చాలా బాగా చేశారు. సతీష్, నీకున్న ఎనర్జీ, ఫిట్‌నెస్ సూపర్బ్. ఈ ఫిట్‌నెస్‌ని అలాగే ఉంచుకో, వదలకు.
మ్యూజిక్ డైరెక్టర్ జి. వి. ప్రకాష్ ఈ సినిమాకి సోల్. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రీల్స్ చూస్తుంటేనే ఆ ఫీల్ వచ్చేస్తోంది. సినిమా రిలీజ్ రోజు మా మామయ్య మోక్ష కూడా ఆ సౌండ్‌కి లిటరల్ గా ఏడ్చేసింది. అందరినీ ఏడిపించేశావ్ జివి, నీ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. ఇక మా ప్రొడ్యూసర్లు నవీన్, రవి నాకు మంచి ఫ్రెండ్స్. నవీన్ పొద్దున్నే 5:30 కి ఫోన్ చేసి ఆయన ఆనందాన్ని పంచుకుంటుంటే చాలా విచిత్రంగా, హ్యాపీగా అనిపించింది. రిలీజ్ రోజు నన్ను హగ్ చేసుకుంటే కింగ్ కాంగ్ సినిమాలో సీన్‌లా ఉందయ్యా అని శివ అన్నాడు. నవీన్, రవి.. బిగ్ కంగ్రాచులేషన్స్. పాండమిక్ టైమ్‌లో మలయాళం, తమిళ్ సినిమాలు బాగా చూసేవాడిని. 80 లలో భారతీరాజా గారు, భారతీచంద్ర గారు చేసినట్లు అంత రూటెడ్ కంటెంట్ ఉన్న సినిమాలు మనవాళ్లు కూడా చేయాలని అనుకునేవాడిని. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తే ఎక్కడ చూసినా ఇరుముడి రియాక్షన్సే కనిపిస్తున్నాయి. 20-25 ఏళ్ల నుంచి థియేటర్లకు రాని 80 ఏళ్ల అవ్వాతాతలు కూడా థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూస్తున్నారని వింటే చాలా ఆనందంగా ఉంది.
గతంలో మున్నాభాయ్ MBBS, 3 ఇడియట్స్ చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ ఫస్ట్ టైమ్ ఎడిటింగ్ రూమ్‌లో శివ నాకు ఈ సినిమా చూపించినప్పుడు దాదాపు చౌక్ అయిపోయాను. బేసిక్‌గా నాకు ఏడుపు రాదు, నాది కాస్త స్టోన్ హార్ట్ అనుకుంటాను. కానీ శివ ఈ కథ, త్రినాథ్ క్యారెక్టరైజేషన్ చెప్పిన తీరు, ఇరుముడి అని టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. శివ నమ్మకం సాలిడ్ గా గెలిచింది. అతనిలోని హానెస్టీ, కన్విక్షన్ నాకు చాలా నచ్చాయి. ఇక సెకండ్ హాఫ్‌లో ప్రియ క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్‌గా రాకపోతే ఆ సీన్ వర్కవుట్ అయ్యేది కాదు, ఫెంటాస్టిక్ జాబ్ ప్రియ. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని' చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం రవితేజ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.