సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మంజు భార్గవి ఆటోబయోగ్రఫీ.. బుక్ టైటిల్ తెలిస్తే షాకే

ABN, Publish Date - Aug 02 , 2026 | 07:53 PM

‘శంకరాభరణం’ చిత్రంతో తెలుగు సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సీనియర్ నటి, ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ మంజు భార్గవి.. తన జీవిత ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నట్లుగా తెలిపారు.

Manju Bhargavi

‘శంకరాభరణం’ చిత్రంతో తెలుగు సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సీనియర్ నటి, ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ మంజు భార్గవి (Manju Bhargavi).. తన జీవిత ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నారు. తన 50 ఏళ్లకు పైబడిన నాట్య, సినీ జీవితంలోని అనేక తీపి జ్ఞాపకాలు, అనుభవాలను ఇందులో పొందుపరుస్తున్నారు. అయితే ఈ ఆటోబయోగ్రఫీకి ఆమె ఎంచుకున్న టైటిల్ ఇప్పుడు సినీ, పాఠక వర్గాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి NSR స్పెషల్ ఇంటర్వ్యూలో ఆమె బయోపిక్‌కు సంబంధించిన బుక్ పేరును మంజు భార్గవి రివీల్ చేశారు.


తన జీవిత కథ పుస్తకానికి ‘ది రెబల్ డ్యాన్సర్’ (The Rebel Dancer) అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేసినట్లు మంజు భార్గవి వెల్లడించారు. ఈ టైటిల్ ఎందుకు పెట్టారనే ప్రశ్నకు సమాధానంగా.. ‘‘నేను నా జీవితంలో, నాట్య రంగానికి సంబంధించి అనేక విషయాల్లో నాదైన శైలిలో తిరుగుబాటు చేశాను. అందుకే నా రైటర్ ఈ శీర్షిక కంటే మంచి టైటిల్ మరొకటి ఉండదని సూచించారు’’ అని వివరించారు. ఇంకా ఈ బుక్ ఎవరు రాస్తున్నారనే వివరాలను కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.


కేవలం పుస్తకం మాత్రమే కాకుండా ఈ ఆటోబయోగ్రఫీని అత్యంత వినూత్నంగా డిజైన్ చేస్తున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. భారతీయ సినీ, నాట్య చరిత్రలోనే తొలిసారిగా ‘చిప్ ఇన్ ఎ బుక్’ (Chip in a book) లేదా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పాఠకులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో నేరుగా ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు, అరుదైన వీడియోలను తిలకించవచ్చని అన్నారు. ఇక ఈ వీడియో ప్రాజెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్ ఆలపించిన సంగీతాన్ని ఉపయోగించినట్లు ఆమె తెలిపారు. ఇంకా ఆమె తన బయోగ్రఫీ బుక్‌కు సంబంధించి.. ఏం చెప్పారో తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

అక్క జ్ఞాపకాలను పంచుకుంటూ.. ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మెహెర్ రమేష్

‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీ ఫ్రంట్ లుక్.. బీజీఎమ్ అదిరింది

King100: నాగ్ వందో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

Updated Date - Aug 02 , 2026 | 07:53 PM