'లీసా' చిత్రం కోసం రంగంలోకి మణిశర్మ

ABN , Publish Date - Sep 15 , 2026 | 12:43 PM

అనన్య నాగళ్ళ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'లీసా' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాతో జవహర్‌ పవార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Leesa movie

వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. తాజాగా ఈ సినిమా టీమ్‌లో మెలొడీ బ్రహ్మ మణిశర్మ జాయిన్‌ అయ్యారు. స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చారని మేకర్స్ తెలిపారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని వారన్నారు.


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. విశేషం ఏమంటే... ఈ సినిమాకు 'ఎస్.ఆర్. కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లీసా’ సినిమా నవంబర్‌లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అల్లాల రవిరెడ్డి, సుమన్, మూసా అలీ ఖాన్, రత్నాకర్ రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ, గడ్డం నవీన్, ఆకెళ్ల, రవిరెడ్డి, స్వప్న చౌదరి, గోపీ కార్తికేయ, సుజాత, సుజి, మానస, శ్యామ్, వెన్ని, జాను వర్మ, కనకం వెంకట్, బేబీ ట్వింకిల్, హనుశ్రీ తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.

ఇవి కూడా చదవండి!

చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్

పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!

Updated Date - Sep 15 , 2026 | 01:20 PM