సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శివాజీ.. భ‌లే ఆఫ‌ర్ పెట్టాడుగా! థియేట‌ర్లు హౌస్‌పుల్ గ్యారంటీ

ABN, Publish Date - Mar 04 , 2026 | 12:49 PM

శివాజీ సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ద పూస‌ని చిత్రం రెండు రోజుల్లో థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ టికెట్ రేట్ల విష‌యంలో అదిరిపోయే ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు.

Sampradayini Suppini Suddapoosani

శివాజీ చాలాకాలం త‌ర్వాత సోలో హీరోగా న‌టించిన చిత్రం సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ద పూస‌ని (Sampradayini Suppini Suddapoosani). ల‌య (Laya) క‌థానాయిక‌గా న‌టించింది. ఔట్ అండ్ ఔట్ కామెడీ, సస్పెన్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌కు వ‌స్తోంది. ముందు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకువ‌ద్దామ‌ని ఫ్లాన్ చేసిన ఈ మూవీ అనూహ్యంగా థియేట‌ర్‌లో రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ప‌లువురు ప్ర‌ముఖులు ముందుగానే ఈ మూవీని చూసి సినిమాలోని కంటెంట్ ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో వారి సూచ‌న‌ల మేర‌ ఈ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్‌కు రెడీ చేశారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించిన మేక‌ర్స్‌ ప్రేక్ష‌కుల‌కు బంపరాఫర్ ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల ఆడియ‌న్స్‌ థియేట‌ర్ల‌కు రావ‌డం భారీగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని టికెట్లు, పాప్‌కార్న్ విష‌యంలో ఆఫ‌ర్ అనౌన్స్ చేశారు. పిల్ల‌లు, పెద్ద‌లు, ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎవ‌రైనా న‌లుగురు క‌లిసి వ‌స్తే వారికి టికెట్ సింగిల్ స్క్రీన్లలో ₹499+ లార్జ్ పాప్‌కార్న్, మల్టీప్లెక్స్‌లలో ₹699కి ఫ్యామిలీ టికెట్ + లార్జ్ పాప్‌కార్న్ ఆఫర్ ఉంటుంద‌ని తెలిపారు. ఈ ఆఫర్ 4 మంది పెద్దలకు వర్తిస్తుందని.. నలుగురు ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీనే అని ఎవ‌రు నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేదు అన్నారు.

సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ద పూస‌ని (Sampradayini Suppini Suddapoosani) మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించిన ఈ ఆఫ‌ర్‌పై ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక కంటెంట్ బావుంటే మాత్రం.. సినిమా రేంజ్ పెరుగుతుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. చూడాలి మ‌రి ప్ర‌జ‌లు ఏ మేరకు థియేట‌ర్‌కు వెళ్లి సినిమాను వీక్షిస్తారో! ఒక‌వేళ ఈ ఆఫ‌ర్ స‌క్సెస్ అయితే.. భ‌విష్య‌త్తులో చాలా మంది ఈ రేట్ల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం లేక‌పోలేదు.

Updated Date - Mar 04 , 2026 | 04:04 PM