సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahesh Babu: కూతురు సితారపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

ABN, Publish Date - Jul 20 , 2026 | 12:18 PM

మహేష్ బాబు తన కుమార్తె సితార ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మహేష్ బాబు (Mahesh Babu) తన కుమార్తె సితార (Sitara) ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అది అభిమానుల మనసులను హత్తుకుంటోంది. సితార 14వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెతో కలిసి దిగిన అందమైన ఫొటోను పంచుకున్నారు 'నువ్వు ఎంత పెద్దదానివైనా.. నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ నా చిన్న తారవే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. నీ ముందున్న ఈ సంవత్సరం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ మహేష్ బాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం మహేష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

మహేష్-నమ్రత దంపతుల కుమార్తెగానే కాకుండా, సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సితార.. డ్యాన్స్ వీడియోలు, ఫోటోషూట్లు, సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.  పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించిన సితార, చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Updated Date - Jul 20 , 2026 | 12:21 PM