సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎంత ప‌నైంది.. 'వార‌ణాసి' ఒరిజిన‌ల్ స్టోరి లీక్‌! పిచ్చోళ్ల‌వ‌డం ఖాయం

ABN, Publish Date - Nov 09 , 2026 | 06:42 PM

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు వార‌ణాసి సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Varanasi, SS Rajamouli

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్‌ బాబు (Mahesh Babu).. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తోంది అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఇది కేవలం భారతీయ సినిమా మాత్రమే కాదు.. అంతర్జాతీయ సినీ సరిహద్దులను చెరిపేస్తూ రాబోతున్న ప్యాన్-వరల్డ్ వండర్ వారణాసి (Varanasi) . గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra), మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తీకేయ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులలో ఒక రేంజ్ హైప్‌ని క్రియేట్ చేశాయి.

అయితే, తాజాగా ఈ ప్యాన్-వరల్డ్ మూవీ స్టోరీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక అత్యంత ఆసక్తికరమైన లీక్డ్ థియరీ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ ( Kumbha) అనే ఒక పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ 'కుంభ' పాత్ర మరేదో కాదు, పౌరాణిక రాక్షసుడైన కుంభకర్ణుడి పునర్జన్మ అట. ఇక ఈ పాత్ర యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే.. రావణాసురుడికి చెందిన అత్యంత శక్తివంతమైన పౌరాణిక 'నవరత్న మాల'ను దక్కించుకోవడం.

ఇక్కడొక విచిత్రమైన, ఆసక్తికరమైన పౌరాణిక అంశం ఉంది. జైన రామాయణం ప్రకారం.. రావణాసురుడి నవరత్న మాలలో ఉండే తొమ్మిది రత్నాల్లో ఆయన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుందట. దీనివల్లే ఆ నవరత్న మాల ధరించినప్పుడు రావణాసురుడికి పది తలలు ఉన్నట్లు కనిపించేదని, అందుకే ఆయనను 'దశాననుడు' అని పిలిచే వారని చెబుతుంటారు. అయితే, పౌరాణిక రామ-రావణ యుద్ధం ముగిసిన తర్వాత.. ఈ తొమ్మిది అమూల్యమైన, అపార శక్తులు కలిగిన రత్నాలు ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో చెల్లాచెదురైపోయాయని ఈ వైరల్ థియరీ పేర్కొంటోంది.

ఈ తొమ్మిది రత్నాలను ఎలాగైనా సేకరించి తన వశం చేసుకోవాలని 'కుంభ' ప్లాన్ చేస్తాడు. అందుకోసం మహేష్ బాబు పాత్రను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు ఖండాలకు ఒక గ్లోబల్ హంట్ కోసం పంపుతాడట. ఈ అద్భుతమైన ప్రయాణంలోనే మహేష్ బాబు పాత్ర ఒక 'వార్మ్‌హోల్' ద్వారా నేరుగా రామాయణ కాలంలోకి ప్రవేశిస్తుందని సమాచారం. అంటే రాజమౌళి మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ తో పాటు సైన్స్ ఫిక్షన్, మైథాలజీ మిక్స్డ్ టైమ్ ట్రావెల్‌ను మనం ఈ సినిమాలో చూడబోతున్నామన్నమాట.

అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ముందే ఉంది. ఆ తొమ్మిది రత్నాలను గనుక ఒకే చోటకు చేరిస్తే.. 'కుంభ'కి అపరిమితమైన, ఎవరూ అడ్డుకోలేని అపార శక్తి లభిస్తుందనే నిజం మహేష్ బాబు పాత్రకు తెలుస్తుంది. కుంభ యొక్క దుష్ట ప్లాన్‌ను అడ్డుకోవడానికి మహేష్ బాబు గతంలోకి ప్రయాణించి, రామ-రావణ యుద్ధ సమయంలోని ఒక అత్యంత కీలకమైన ఘట్టంలో జోక్యం చేసుకుంటారట. తద్వారా ఆ హారం యొక్క భవితవ్యాన్ని తిరగరాసి, ఆ తొమ్మిది రత్నాలు ఎప్పటికీ ఒకే చోట చేరకుండా చెల్లాచెదురు చేస్తారని టాక్ వినబడుతోంది.

వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఈ పాయింట్.. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఒక క్రేజీ ఊహాగాన సిద్ధాంతం మాత్రమే. అయితే, ఇప్పటికే జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్.. వారణాసిలో రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధం చూపించబోతున్నామని, అదే సినిమాకు హైలైట్ అని చెప్పడంతో ఈ థియరీ నిజమే అంటున్నారు కొందరు. మరి విజనరీ డైరెక్టర్ రాజమౌళి తన మార్క్ గ్రాండియర్ కథనంతో ఈ పాయింట్స్‌ని సిల్వర్ స్క్రీన్ పై ఎలా మలుస్తారో చూడాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 09 , 2026 | 06:53 PM