సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వార‌ణాసి.. సగ భాగం పూర్తి చేశారు

ABN, Publish Date - Feb 25 , 2026 | 07:38 AM

మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

Varanasi

మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు, పోరాట ఘట్టాలను చిత్రీకరించారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ చిత్రం ద్వితియార్థానికి సంబంధించిన కీల‌క‌ సన్నివేశాలను జార్జియాలో షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌హేశ్ బాబు మంగ‌ళ వారం హైద‌రాబాద్ నుంచి జార్జియాకు వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా భార్య న‌మ్ర‌త‌, కూతురు సితార ఎయిర్‌పోర్టుకు వ‌చ్చి బాబుకు సెండాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉండడంతో ఎంత వీలైతే అంత తొందరగా షూటింగ్‌ను పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రుద్ర పాత్రలో కనిపించనున్నారు మహేశ్‌బాబు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ హాలీవుడ్‌లోనూ విడుదలవుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ మూవీ టీజ‌ర్ అనేక అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో ప్ర‌ద‌ర్శిస్తూ సినిమాపై హైప్ అంత‌కంత‌కు పెంచుతూ వ‌స్తున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 07:49 AM