సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: మహేష్ ‘రుద్ర’ పాత్రపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Oct 03 , 2026 | 04:42 PM

‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి దర్శకుడు రాజమౌళి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Varanasi Update

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కలయికలో వస్తోన్న పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). జక్కన్న, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతోన్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బయటకొచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేయగా, అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే, తాజాగా రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.


అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘పెన్ స్టేట్ యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్’ విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా జక్కన్న ‘వారణాసి’ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్న ‘రుద్ర’ (Mahesh Rudra Role) పాత్ర గురించి మాట్లాడుతూ రాజమౌళి చాలా ఎమోషనల్ అయ్యారు. ‘‘షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు మహేష్ నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఎలా రాబట్టాలా? అని చాలా ఆలోచించాను. కానీ, ఒకసారి సెట్‌లోకి అడుగుపెట్టాక ఆయన యాక్టింగ్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఒక డైరెక్టర్‌గా నేను వంద శాతం ఎఫర్ట్ ఆశిస్తే.. మహేష్ బాబు ఏకంగా రెండు వందల శాతం ఎఫర్ట్ పెట్టి నన్ను పూర్తిగా సర్‌ప్రైజ్ చేశారు’’ అని జక్కన్న కొనియాడారు. అంతేకాదు, తాను కాస్టింగ్ విషయంలో ఏనాడూ స్టార్‌డమ్‌‌ను చూడనని, కేవలం కథ డిమాండ్ చేసే నటులనే ఎంచుకుంటానని స్పష్టం చేసిన రాజమౌళి.. ‘రుద్ర’ పాత్రలో మహేష్ నటించలేదని, అసలు తెరపై జీవించేశారని పొగడ్తల వర్షం కురిపించారు. జక్కన్న మాటలు వింటుంటే మహేష్ బాబు పాత్ర ఈ సినిమాలో ఏ రేంజ్‌‌‌లో ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతోంది.


ఇక ఈ సినిమాలో రాజమౌళి మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త విజువల్ మైండ్‌బ్లోయింగ్ వరల్డ్‌ను ఆవిష్కరించబోతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన వారణాసి నేపథ్యంలో కథ ప్రారంభమై.. అంటార్కిటికా మంచు ఖండాలు, ఆఫ్రికా దట్టమైన అడవులు, అలాగే పురాతన రోమ్ సామ్రాజ్యం వరకు విభిన్న కాలాలు, భిన్నమైన భౌగోళిక ప్రాంతాల చుట్టూ ఈ గ్లోబల్ సాహస ప్రయాణం సాగనుంది. ప్రపంచ స్థాయి క్వాలిటీతో ఈ విజువల్ వండర్ తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. ఈ క్రేజీ పాన్-వరల్డ్ విజువల్ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది. రాజమౌళి మార్క్ అడ్వెంచర్, మహేష్ బాబు రెండొందల శాతం ఎఫర్ట్‌తో వస్తున్న ‘వారణాసి’ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Drishyam 3: అక్షయ్ ఖన్నా తప్పిదం.. జైదీప్‌కు జాక్‌పాట్

రెండు పార్టులుగా సాయిపల్లవి రెండు సినిమాలు

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం.. అక్టోబర్‌లోనూ డౌటే!

Updated Date - Oct 03 , 2026 | 04:42 PM